Auno kaado yeemaada amganalaala

ఔనో కాదో యీమాట అంగనలాల
Language

(॥పల్లవి॥)
ఔనో కాదో యీమాట అంగనలాల
దానఁ బెట్టక వలపు ననుపై నిలుచునా

(॥॥)
యెన్ని తలపోఁతలతో నెంచుకొని వుండినాను
కన్నులఁ బతిఁ జూడక కాంక్ష దీరునా
సన్నలు వేడుక తోడ సారె సారెఁ జేసినాను
విన్నపము సేయక వెసఁ దనివారునా

(॥॥)
చాయవాటుగా నెట్టు సరసము లాడినాను
చేయి చాఁచి పెనఁగక చెమరించునా
పాయపుమదాన నెంత పచ్చిదేర నవ్వినాను
రాయడి రతులఁ గాక రంజకము వుట్టునా

(॥॥)
ఆసల లోలోనెంత ఆరడిఁ బొరలినాను
సేసవెట్టి పెండ్లాడక చే చిక్కునా
యీసరి నలమేల్మంగ నేను శ్రీ వేంకటేశుఁడు
వాసితోఁ దా నన్ను నిటువలెఁ గూడకుండునా

(||pallavi||)
auno kādo yīmāḍa aṁganalāla
dānam̐ bĕṭṭaga valabu nanubai nilusunā

(||||)
yĕnni talabom̐talado nĕṁchugŏni vuṁḍinānu
kannulam̐ badim̐ jūḍaga kāṁkṣha dīrunā
sannalu veḍuga toḍa sārĕ sārĕm̐ jesinānu
vinnabamu seyaga vĕsam̐ danivārunā

(||||)
sāyavāḍugā nĕṭṭu sarasamu lāḍinānu
seyi sām̐si pĕnam̐gaga sĕmariṁchunā
pāyabumadāna nĕṁta pachchidera navvinānu
rāyaḍi radulam̐ gāga raṁjagamu vuṭṭunā

(||||)
āsala lolonĕṁta āraḍim̐ bŏralinānu
sesavĕṭṭi pĕṁḍlāḍaga se sikkunā
yīsari nalamelmaṁga nenu śhrī veṁkaḍeśhum̐ḍu
vāsidom̐ dā nannu niḍuvalĕm̐ gūḍaguṁḍunā