ఔనే యిది జాణతన మందుకే నే మెచ్చితిని
(॥పల్లవి॥)
ఔనే యిది జాణతన మందుకే నే మెచ్చితిని
నా నోరఁ బలికే నంటే నవ్వు వచ్చీఁ గాని
(॥ఔనే॥)
కానుకగాఁ దనకు నేఁ గప్పుర మంపితి నని
ఆనవాలు చెప్పెంపే న న్నందు కేమే
పూని తా వలచినట్టి పాలఁతి దోడి తెమ్మంటే
దీనికే నే నియ్యకొని తేరాదు గాని
(॥ఔనే॥)
అడరి సొమ్ము లిద్దర మట్టె మార్చుకొంటి మని
అడియాల మిచ్చి పంపీ నందు కేమే
తడవి యేమైనాను తనకును నాపెకును
యడ మిచ్చి పండఁ జోటియ్యరాదు గాని
(॥ఔనే॥)
రంగున నేఁ గూడినట్టి రహస్యపువేళ దన
అంగపు గుఱుతు చూపినందు కేమే
యింగితాన శ్రీవేంకటేశుఁ డాకె తనపొందు
లంగవించి సాకిరైనా కనరాదు గాని
(||pallavi||)
aune yidi jāṇadana maṁduge ne mĕchchidini
nā noram̐ balige naṁṭe navvu vachchīm̐ gāni
(||aune||)
kānugagām̐ danagu nem̐ gappura maṁpidi nani
ānavālu sĕppĕṁpe na nnaṁdu keme
pūni tā valasinaṭṭi pālam̐ti doḍi tĕmmaṁṭe
dīnige ne niyyagŏni terādu gāni
(||aune||)
aḍari sŏmmu liddara maṭṭĕ mārsugŏṁṭi mani
aḍiyāla michchi paṁpī naṁdu keme
taḍavi yemainānu tanagunu nābĕgunu
yaḍa michchi paṁḍam̐ joḍiyyarādu gāni
(||aune||)
raṁguna nem̐ gūḍinaṭṭi rahasyabuveḽa dana
aṁgabu guṟudu sūbinaṁdu keme
yiṁgidāna śhrīveṁkaḍeśhum̐ ḍāgĕ tanabŏṁdu
laṁgaviṁchi sāgirainā kanarādu gāni