ఔనే నీ సుద్దులకు అడ్డము చెప్పఁగ రాదు
(॥పల్లవి॥)
ఔనే నీ సుద్దులకు అడ్డము చెప్పఁగ రాదు
కానని యడల కైనఁ గలహాలు వుట్టవా
(॥ఔనే॥)
యింటికి వచ్చెఁ జాలదా యేతువ లెత్తఁగ నేల
కంటు లేని దొడ్డవానిఁ గల్ల నేతురా
అంటి ముట్టి యిందు కెల్ల నాతఁడు గాఁగానె కాక
గొంటరి చెలుల కైనఁ గోపములు రేఁగవా
(॥ఔనే॥)
పంత మిచ్చెఁ జాలదా పై పై బిగియ నేల
చెంత నీప్రాణవిభునిఁ జిన్నఁ బుత్తురా
అంతే పో నినుబోఁటి కాతఁడే తగుఁ గాక
యంతయు మాకుఁ జూచితే యేవ వుట్టదా
(॥ఔనే॥)
చెక్కు నొక్కెఁ జాలదా చేతఁ దీసి వేయ నేల
దక్కె శ్రీవెంకటేశుఁ దప్పు లెంతురా
నిక్కము నాతఁడు నీవు నేరుచుకొంటిరి గాక
తక్కిన మావంటివారు తగ వందురా
(||pallavi||)
aune nī suddulagu aḍḍamu sĕppam̐ga rādu
kānani yaḍala kainam̐ galahālu vuṭṭavā
(||aune||)
yiṁṭigi vachchĕm̐ jāladā yeduva lĕttam̐ga nela
kaṁṭu leni dŏḍḍavānim̐ galla nedurā
aṁṭi muṭṭi yiṁdu kĕlla nādam̐ḍu gām̐gānĕ kāga
gŏṁṭari sĕlula kainam̐ gobamulu rem̐gavā
(||aune||)
paṁta michchĕm̐ jāladā pai pai bigiya nela
sĕṁta nīprāṇavibhunim̐ jinnam̐ butturā
aṁte po ninubom̐ṭi kādam̐ḍe tagum̐ gāga
yaṁtayu māgum̐ jūside yeva vuṭṭadā
(||aune||)
sĕkku nŏkkĕm̐ jāladā sedam̐ dīsi veya nela
dakkĕ śhrīvĕṁkaḍeśhum̐ dappu lĕṁturā
nikkamu nādam̐ḍu nīvu nerusugŏṁṭiri gāga
takkina māvaṁṭivāru taga vaṁdurā