Aune mamchivaare meeru ammaro nemdu

ఔనే మంచివారే మీరు అమ్మరో నేఁడు
Language

(॥పల్లవి॥)
ఔనే మంచివారే మీరు అమ్మరో నేఁడు
వీనులాలఁ బొగడితే విందుఁ గాక యతని

(॥॥)
చెలువుని దూరకురే చెలులాల
అలరి ప్రాణమై వుండు నాతఁడు నాకు
తలచుక వచ్చీఁ గాక తానే యీడకు
బలిమి సేతు రటవే బత్తి నాపై గలఁడు

(॥॥)
రమణునిఁ గొంగు వట్టి రాఁ దియ్యకురే
అమరి నాపాలి దేవరై వుండును
తమిగలప్పుడు నన్నుఁ దానే కూడీని
తిమురుదురటే నాకు దిక్కయినవాఁ డితఁడు

(॥॥)
సన్నల శ్రీ వేంకటేశు జలసే రేలే
అన్నిటా నా కాతఁ డాత్మయై వుండును
మన్నించి కూడె నలమేల్మంగను నేను
పన్నుక నవ్వుదురటే పంతముతో జాణఁడూ

(||pallavi||)
aune maṁchivāre mīru ammaro nem̐ḍu
vīnulālam̐ bŏgaḍide viṁdum̐ gāga yadani

(||||)
sĕluvuni dūragure sĕlulāla
alari prāṇamai vuṁḍu nādam̐ḍu nāgu
talasuga vachchīm̐ gāga tāne yīḍagu
balimi sedu raḍave batti nābai galam̐ḍu

(||||)
ramaṇunim̐ gŏṁgu vaṭṭi rām̐ diyyagure
amari nābāli devarai vuṁḍunu
tamigalappuḍu nannum̐ dāne kūḍīni
timuruduraḍe nāgu dikkayinavām̐ ḍidam̐ḍu

(||||)
sannala śhrī veṁkaḍeśhu jalase rele
anniḍā nā kādam̐ ḍātmayai vuṁḍunu
manniṁchi kūḍĕ nalamelmaṁganu nenu
pannuga navvuduraḍe paṁtamudo jāṇam̐ḍū