(॥పల్లవి॥)
ఔనే మంచిదాన వౌదువే నీవు
సానఁబట్టి వలపులు జళిపించేవు
(॥ఔనే॥)
చెలఁగి యాతఁడు నీకుఁ జెప్పేటి ప్రియాలకా
చలపట్టి దగ్గరక జంకించేవు
మొలకనవ్వులు నవ్వి ముంచిన మోహానకా
వలవని జాగుతోడ వంచేవు శిరసు
(॥ఔనే॥)
చిత్తగించి నీమీఁద జేయి వేసినందుకా
కొత్తలుగా నీవు కొనగోరఁ జిమ్మేవు
బత్తి సేసె నీకు మంచి బాగా లిచ్చి నందుకా
యెత్తిన మదముతోడ యీసడించేము
(॥ఔనే॥)
కుచ్చిపట్టి కాఁగిలించి కూడిన యిందులకా
హెచ్చి శ్రీ వేంకటేశ్వరు నెలయించేవు
బచ్చన సరసముల పంతమిచ్చినందుకా
విచ్చనవిడుల నీవు వేసాలు సేసేవు
(||pallavi||)
aune maṁchidāna vauduve nīvu
sānam̐baṭṭi valabulu jaḽibiṁchevu
(||aune||)
sĕlam̐gi yādam̐ḍu nīgum̐ jĕppeḍi priyālagā
salabaṭṭi daggaraga jaṁkiṁchevu
mŏlaganavvulu navvi muṁchina mohānagā
valavani jāgudoḍa vaṁchevu śhirasu
(||aune||)
sittagiṁchi nīmīm̐da jeyi vesinaṁdugā
kŏttalugā nīvu kŏnagoram̐ jimmevu
batti sesĕ nīgu maṁchi bāgā lichchi naṁdugā
yĕttina madamudoḍa yīsaḍiṁchemu
(||aune||)
kuchchibaṭṭi kām̐giliṁchi kūḍina yiṁdulagā
hĕchchi śhrī veṁkaḍeśhvaru nĕlayiṁchevu
bachchana sarasamula paṁtamichchinaṁdugā
vichchanaviḍula nīvu vesālu sesevu