ఔనే జాణవౌదువు అన్నిటా నీవు
(॥పల్లవి॥)
ఔనే జాణవౌదువు అన్నిటా నీవు
నానెఁ గదవే సెలవి నవ్వుల నీ సన్నలు
(॥ఔనే॥)
చూడఁజూడ సూట్లు సుదతి నీ చూపులు
వాడ వాడ వలపులు వాడికలు
కూడఁగూడ గురుతులు కొనగోరి చెనకులు
యేడఁ1గోలదనివెట్టే మిట్టి చతురతలు
(॥ఔనే॥)
వండ వండనట్లు వడి నీతరితీపులు
వుండనుండ వేడుకలు వునుకులే
పండఁబండ మచ్చికలు పానుపుపై నీ రతులు
నిండుకొనెఁగదె నీ నేరుపుల కథలు
(॥ఔనే॥)
పెంచఁబెంచఁ బెరిగీని పెద్దలై నీ చన్నులు
ముంచ ముంచ నూరీ నీ మోవి తేనెలు
యెంచఁగ శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్ను నేలె
మించెఁగదవె నేఁడు మిక్కిలి నీ కతలు
(||pallavi||)
aune jāṇavauduvu anniḍā nīvu
nānĕm̐ gadave sĕlavi navvula nī sannalu
(||aune||)
sūḍam̐jūḍa sūṭlu sudadi nī sūbulu
vāḍa vāḍa valabulu vāḍigalu
kūḍam̐gūḍa gurudulu kŏnagori sĕnagulu
yeḍam̐1goladanivĕṭṭe miṭṭi saduradalu
(||aune||)
vaṁḍa vaṁḍanaṭlu vaḍi nīdaridībulu
vuṁḍanuṁḍa veḍugalu vunugule
paṁḍam̐baṁḍa machchigalu pānububai nī radulu
niṁḍugŏnĕm̐gadĕ nī nerubula kathalu
(||aune||)
pĕṁcham̐bĕṁcham̐ bĕrigīni pĕddalai nī sannulu
muṁcha muṁcha nūrī nī movi tenĕlu
yĕṁcham̐ga śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnu nelĕ
miṁchĕm̐gadavĕ nem̐ḍu mikkili nī kadalu