Aune bhaagyavamturaala vannidaa neevu

ఔనె భాగ్యవంతురాల వన్నిటా నీవు
Language

(॥పల్లవి॥)
ఔనె భాగ్యవంతురాల వన్నిటా నీవు
దీననే తలఁపెల్లాఁ దెలిసె మాకు

(॥॥)
చనవులు నెరుపేవు సలిగెలు మెరసేవు
గొనకొని పతితోడ కొలువులోనె
ననుపులు సేసేవు నవ్వులు నవ్వేవు
ఘనమైన నీ యెమ్మెలు కంటిమే నేము

(॥॥)
పలుమారు మురిసేవు పంతములు చూపేవు
సొలిసి యాతఁడు మోము చూడఁగానే
కళల విఱ్ఱవీఁగేవు కనుసన్నలు సేసేవు
చెలియ నిన్నిట్టె సంతిసించితిమే నేము

(॥॥)
చుట్టమవై కలసేవు సుద్దులెల్లాఁ జెప్పేవు
గట్టిగా శ్రీ వేంకటేశుకాఁగిటనే
మెట్టేవు పాదములు మేనరికమే పెంచేవు
గుట్టున నన్నితఁడేలె కోరితిమే నేము

(||pallavi||)
aunĕ bhāgyavaṁturāla vanniḍā nīvu
dīnane talam̐pĕllām̐ dĕlisĕ māgu

(||||)
sanavulu nĕrubevu saligĕlu mĕrasevu
gŏnagŏni padidoḍa kŏluvulonĕ
nanubulu sesevu navvulu navvevu
ghanamaina nī yĕmmĕlu kaṁṭime nemu

(||||)
palumāru murisevu paṁtamulu sūbevu
sŏlisi yādam̐ḍu momu sūḍam̐gāne
kaḽala viṭravīm̐gevu kanusannalu sesevu
sĕliya ninniṭṭĕ saṁtisiṁchidime nemu

(||||)
suṭṭamavai kalasevu suddulĕllām̐ jĕppevu
gaṭṭigā śhrī veṁkaḍeśhugām̐giḍane
mĕṭṭevu pādamulu menarigame pĕṁchevu
guṭṭuna nannidam̐ḍelĕ koridime nemu