ఔనయ్యా వూరకుంటే నట్టే కాదా
(॥పల్లవి॥)
ఔనయ్యా వూరకుంటే నట్టే కాదా
మానినుల జెనకేవు మదమా నీది
(॥॥)
యెవ్వరి తెరువుఁ బోక యింటిలోన నుండేవారి
పువ్వుల వేసే వదేమి పొద్దు వోదా
నివ్వటిల్లు సిగ్గుతోడ నిలుచుండేవారిని
రవ్వగాఁ జన్నులంటేవు రాజసమా నీకు
(॥॥)
గార వానఁ జక్కజాడఁ గాఁపురము సేసే వారి
వూరక గోర నొత్తేవు వుండఁబట్టదా
సారెకుఁ బానుపుమీఁదఁ జదువుకోనే వారి
నీరీతిఁ బాదాన జిమ్మే వెమ్మెలా నీకు
(॥॥)
వొచ్చము లేక నీకు నూడిగము సేసే వారి
మచ్చిక నలయించేవు మన్నించరాదా
యిచ్చట శ్రీవేంకటేశ యిట్టే నన్ను నేలితివి
పెచ్చువెరిగే వింతేసి ప్రియమా నీకు
(||pallavi||)
aunayyā vūraguṁṭe naṭṭe kādā
māninula jĕnagevu madamā nīdi
(||||)
yĕvvari tĕruvum̐ boga yiṁṭilona nuṁḍevāri
puvvula vese vademi pŏddu vodā
nivvaḍillu siggudoḍa nilusuṁḍevārini
ravvagām̐ jannulaṁṭevu rājasamā nīgu
(||||)
gāra vānam̐ jakkajāḍam̐ gām̐puramu sese vāri
vūraga gora nŏttevu vuṁḍam̐baṭṭadā
sārĕgum̐ bānubumīm̐dam̐ jaduvugone vāri
nīrīdim̐ bādāna jimme vĕmmĕlā nīgu
(||||)
vŏchchamu lega nīgu nūḍigamu sese vāri
machchiga nalayiṁchevu manniṁcharādā
yichchaḍa śhrīveṁkaḍeśha yiṭṭe nannu nelidivi
pĕchchuvĕrige viṁtesi priyamā nīgu