ఔనయ్యా నీవేమైనా నంటివి గాని
(॥పల్లవి॥)
ఔనయ్యా నీవేమైనా నంటివి గాని
యీ నెలఁతఁ జిత్తగించు యేమనఁగ వచ్చును
(॥ఔన॥)
మొలకలైన చన్నులే మోవరాని మోఁపు లౌను
కలికి కన్నులచూపు గాలపువేఁట
పలచని కెమ్మోవి పండి పచ్చితేనె గారు
కెలనఁ గాంతల నెట్టు గెలువఁగ వచ్చును
(॥ఔన॥)
వేమరు నాడే మాటలే వెస నంటు జిగురులు
ఆముకొన్న బొమ్మజంకె లాసవలలు
దోమటి చుట్టరికాలు తోయఁగరాని తగుళ్లు
భామలగంటే మనసు పట్టనెట్టు వచ్చును
(॥ఔన॥)
నేరుపుల వినయాలు నెరి నడపు నీడలు
కూరిమిచెనకులు చొక్కులమందులు
యీరీతి శ్రీ వేంకటేశ యీకె నిట్టె యేలితివి
చేరి సతుల రతులు చెప్ప నెట్టు వచ్చును
(||pallavi||)
aunayyā nīvemainā naṁṭivi gāni
yī nĕlam̐tam̐ jittagiṁchu yemanam̐ga vachchunu
(||auna||)
mŏlagalaina sannule movarāni mom̐pu launu
kaligi kannulasūbu gālabuvem̐ṭa
palasani kĕmmovi paṁḍi pachchidenĕ gāru
kĕlanam̐ gāṁtala nĕṭṭu gĕluvam̐ga vachchunu
(||auna||)
vemaru nāḍe māḍale vĕsa naṁṭu jigurulu
āmugŏnna bŏmmajaṁkĕ lāsavalalu
domaḍi suṭṭarigālu toyam̐garāni taguḽlu
bhāmalagaṁṭe manasu paṭṭanĕṭṭu vachchunu
(||auna||)
nerubula vinayālu nĕri naḍabu nīḍalu
kūrimisĕnagulu sŏkkulamaṁdulu
yīrīdi śhrī veṁkaḍeśha yīgĕ niṭṭĕ yelidivi
seri sadula radulu sĕppa nĕṭṭu vachchunu