Aunayyaa needevulamtaa nalayi keṟamgavaddaa

ఔనయ్యా నీదేవులంటా నలయి కెఱఁగవద్దా
Language

(॥పల్లవి॥)
ఔనయ్యా నీదేవులంటా నలయి కెఱఁగవద్దా
తానకమై నేమెల్లా నింతకు నోపఁగలమా

(॥॥)
బత్తితోడ నీకుఁ జెలి పాదములు గుద్దఁ గాను
గుత్తపుచనుగుబ్బలు గునిసీనవె
తత్తరానఁ జేసురటి తడఁబడ విసరఁ గా
చిత్తడిచెమట గారీఁ జెక్కులవెంటను

(॥॥)
అంది యంది యప్పటి నీ కాకుమడి చియ్యఁ గాను
కందువలఁ గంకణాలు గల్లనీ నీవె
సందడి వింజామర సారెసారె వేయఁ గాను
పొంది నిట్టూర్పులు రేఁగీ పుక్కిటిబంటిగను

(॥॥)
కడఁగి నీమేన నిండాఁ గస్తూరి యలఁదఁ గాను
మెడనున్న మాణిక్యాలు మెరిచీ నవె
తడవి శ్రీ వేంకటేశ తగ నన్ను నేలితివి
పడఁతి నివ్వెరగందీఁ బరవశమునను

(||pallavi||)
aunayyā nīdevulaṁṭā nalayi kĕṟam̐gavaddā
tānagamai nemĕllā niṁtagu nobam̐galamā

(||||)
battidoḍa nīgum̐ jĕli pādamulu guddam̐ gānu
guttabusanugubbalu gunisīnavĕ
tattarānam̐ jesuraḍi taḍam̐baḍa visaram̐ gā
sittaḍisĕmaḍa gārīm̐ jĕkkulavĕṁṭanu

(||||)
aṁdi yaṁdi yappaḍi nī kāgumaḍi siyyam̐ gānu
kaṁduvalam̐ gaṁkaṇālu gallanī nīvĕ
saṁdaḍi viṁjāmara sārĕsārĕ veyam̐ gānu
pŏṁdi niṭṭūrbulu rem̐gī pukkiḍibaṁṭiganu

(||||)
kaḍam̐gi nīmena niṁḍām̐ gastūri yalam̐dam̐ gānu
mĕḍanunna māṇikyālu mĕrisī navĕ
taḍavi śhrī veṁkaḍeśha taga nannu nelidivi
paḍam̐ti nivvĕragaṁdīm̐ baravaśhamunanu