Aunayyaa mamchivaamdavu aaṟadi yimta seduraa

ఔనయ్యా మంచివాఁడవు ఆఱడి యింత సేతురా
Language

(॥పల్లవి॥)
ఔనయ్యా మంచివాఁడవు ఆఱడి యింత సేతురా
పూనినట్టి తమకము బుద్దెఱుంగునా

(॥ఔన॥)
మంతనములాడఁగానే మర్మములంటేవు నీవు
యింత కాకు గలదా యిదేమయ్యా
వింతవారు నవ్వఁగాను వేళ లేదా నీకు మరి
యెంతైనా వలపు సిగ్గులెరుఁగునా భువిని

(॥ఔన॥)
ఆకు మడిచియ్యఁగానే అట్టే సరసాలాడేవు
మేకులెన్ని నేర్చితివి మేలయ్యా
జోకఁ గాతరించేవు చోటు లేదా నీకు మరి
యేకడ మదము యెగ్గులెరుఁగునా భువిని

(॥ఔన॥)
గందము నీకుఁ బూయఁగ కాఁగిటఁ గూడితివిట్టే
మందెమేళము సేతురా మమ్ము నీవయ్యా
విందుల శ్రీవేంకటేశ వేరె మాటు లేదా మరి
యెందును వేడుకాడికెలెఱుఁగునా భువిని

(||pallavi||)
aunayyā maṁchivām̐ḍavu āṟaḍi yiṁta sedurā
pūninaṭṭi tamagamu buddĕṟuṁgunā

(||auna||)
maṁtanamulāḍam̐gāne marmamulaṁṭevu nīvu
yiṁta kāgu galadā yidemayyā
viṁtavāru navvam̐gānu veḽa ledā nīgu mari
yĕṁtainā valabu siggulĕrum̐gunā bhuvini

(||auna||)
āgu maḍisiyyam̐gāne aṭṭe sarasālāḍevu
megulĕnni nersidivi melayyā
jogam̐ gādariṁchevu soḍu ledā nīgu mari
yegaḍa madamu yĕggulĕrum̐gunā bhuvini

(||auna||)
gaṁdamu nīgum̐ būyam̐ga kām̐giḍam̐ gūḍidiviṭṭe
maṁdĕmeḽamu sedurā mammu nīvayyā
viṁdula śhrīveṁkaḍeśha verĕ māḍu ledā mari
yĕṁdunu veḍugāḍigĕlĕṟum̐gunā bhuvini