ఔనయ్యా మంచివాఁడ వన్నియు నెఱిఁగితిమి
(॥పల్లవి॥)
ఔనయ్యా మంచివాఁడ వన్నియు నెఱిఁగితిమి
మానలేము నిన్నాడక మనసులోఁ గలది
(॥॥)
దప్పిదేరె నీమోవికి తరుణులమోము చూచి
కప్పుర మిమ్మంటేనే కాఁతాళించేవు
తప్పు లెంచితినా నిన్ను దయదలఁచితిఁగాక
యెప్పుడూ నీయనుమానా లేఁతైనా విడువవు
(॥॥)
నిరతిఁ జెక్కులమీఁదినిండుఁజెమటలు వాయ
సురటి విసురుమంటేఁ జూచి తిట్టేవు
నెరసు లెంచితినా నెయ్యము చూచితిఁగాక
యెరవులే కలకాలమెల్లా నెరుపేవు
(॥॥)
సారె జాఱుఁదురుమున జాజులు నిండాఁ బెట్టి
చేరి ముడువుమంటేనే సిగ్గువడేవు
అరయ శ్రీవెంకటేశ అంతలో నన్నేలితివి
కోరికెఁదనివిలేక కొంగులు వట్టేవు
(||pallavi||)
aunayyā maṁchivām̐ḍa vanniyu nĕṟim̐gidimi
mānalemu ninnāḍaga manasulom̐ galadi
(||||)
dappiderĕ nīmovigi taruṇulamomu sūsi
kappura mimmaṁṭene kām̐tāḽiṁchevu
tappu lĕṁchidinā ninnu dayadalam̐sidim̐gāga
yĕppuḍū nīyanumānā lem̐tainā viḍuvavu
(||||)
niradim̐ jĕkkulamīm̐diniṁḍum̐jĕmaḍalu vāya
suraḍi visurumaṁṭem̐ jūsi tiṭṭevu
nĕrasu lĕṁchidinā nĕyyamu sūsidim̐gāga
yĕravule kalagālamĕllā nĕrubevu
(||||)
sārĕ jāṟum̐durumuna jājulu niṁḍām̐ bĕṭṭi
seri muḍuvumaṁṭene sigguvaḍevu
araya śhrīvĕṁkaḍeśha aṁtalo nannelidivi
korigĕm̐danivilega kŏṁgulu vaṭṭevu