Aunayyaa mamchivaamda vannidaa neevu

ఔనయ్యా మంచివాఁడ వన్నిటా నీవు
Language

(॥పల్లవి॥)
ఔనయ్యా మంచివాఁడ వన్నిటా నీవు
యీ నవ్వులవంక నీకు నేమి గూడె నిపుడు

(॥॥)
తచ్చనకాఁడవై నీవు తరుణుల నెగపోసి
అచ్చలాన యెచ్చుగుందు లాడుమనేవు
ఇచ్చకురాండ్లు నీకు నిద్దరు సరేకాదా
కచ్చుపెట్టి యిందు నేమిగట్టుకొనే విపుడు

(॥॥)
వినోదకాఁ డవై నీవు వీరీ వారీ సన్నసేసి
పెనఁగులాటకుఁ బెట్టి పెచ్చురేఁచేవు
యెనయ నీకీపెనాపె నితవరులే కారా
పవివడి యిందు నెంతఫల మబ్బె నీకు

(॥॥)
యెమ్మెకాఁడవై నీవు యిరుమేలా నిడుకొని
వుమ్మడిఁ గాఁగిటఁ గూడి వుబ్బించేవు
కమ్మి యక్కచెల్లెండ్లు గారా శ్రీ వేంకటేశ
సమ్మతి నీ కెటువంటిచవివుట్టె నిపుడు

(||pallavi||)
aunayyā maṁchivām̐ḍa vanniḍā nīvu
yī navvulavaṁka nīgu nemi gūḍĕ nibuḍu

(||||)
tachchanagām̐ḍavai nīvu taruṇula nĕgabosi
achchalāna yĕchchuguṁdu lāḍumanevu
ichchagurāṁḍlu nīgu niddaru saregādā
kachchubĕṭṭi yiṁdu nemigaṭṭugŏne vibuḍu

(||||)
vinodagām̐ ḍavai nīvu vīrī vārī sannasesi
pĕnam̐gulāḍagum̐ bĕṭṭi pĕchchurem̐sevu
yĕnaya nīgībĕnābĕ nidavarule kārā
pavivaḍi yiṁdu nĕṁtaphala mabbĕ nīgu

(||||)
yĕmmĕgām̐ḍavai nīvu yirumelā niḍugŏni
vummaḍim̐ gām̐giḍam̐ gūḍi vubbiṁchevu
kammi yakkasĕllĕṁḍlu gārā śhrī veṁkaḍeśha
sammadi nī kĕḍuvaṁṭisavivuṭṭĕ nibuḍu