Aunayyaa mamchivaamda vamdugellaa nenaa guri

ఔనయ్యా మంచివాఁడ వందుకెల్లా నేనా గురి
Language

(॥పల్లవి॥)
ఔనయ్యా మంచివాఁడ వందుకెల్లా నేనా గురి
నానఁబెట్టి సెలవుల నవ్వులు నవ్వేవు

(॥॥)
చెలియచేసినసేఁత చెప్పేవానివలెనే
కలుపుకోలుగ నన్నుఁ గాఁగిలించేవు
పొలసి గోరనూఁదుట చూపేవానివలెనే
కెలయుచు నాబుజము గీరేవు నీవు

(॥॥)
యెచ్చుగుందుమాటలు యెంచేవానివలెనే
వచ్చిదేరేవొట్టు నాపైఁ బచారించేవు
దిచ్చరిసాకిరు లిట్టె తెలిపేవానివలెనే
ముచ్చటఁ జేతులు నామోముపైఁ జాఁచేవు

(॥॥)
పెనఁగులాటలు తలపించేవానివలెనే
గొనకొని నా పెద్దకొప్పు వట్టేవు
యెనసి శ్రీ వేంకటేశ యింతిఁ గూడినట్లానే
అనువైనఅలమేల్మంగనైననున్నఁ గూడేవు

(||pallavi||)
aunayyā maṁchivām̐ḍa vaṁdugĕllā nenā guri
nānam̐bĕṭṭi sĕlavula navvulu navvevu

(||||)
sĕliyasesinasem̐ta sĕppevānivalĕne
kalubugoluga nannum̐ gām̐giliṁchevu
pŏlasi goranūm̐duḍa sūbevānivalĕne
kĕlayusu nābujamu gīrevu nīvu

(||||)
yĕchchuguṁdumāḍalu yĕṁchevānivalĕne
vachchiderevŏṭṭu nābaim̐ basāriṁchevu
dichcharisāgiru liṭṭĕ tĕlibevānivalĕne
muchchaḍam̐ jedulu nāmomubaim̐ jām̐sevu

(||||)
pĕnam̐gulāḍalu talabiṁchevānivalĕne
gŏnagŏni nā pĕddagŏppu vaṭṭevu
yĕnasi śhrī veṁkaḍeśha yiṁtim̐ gūḍinaṭlāne
anuvainaalamelmaṁganainanunnam̐ gūḍevu