Aunayya tagavu nemdattide kaadaa

ఔనయ్య తగవు నేఁడట్టిదె కాదా
Language

(॥పల్లవి॥)
ఔనయ్య తగవు నేఁడట్టిదె కాదా
వెూనముతోడుత నీకు మొక్కు మొక్కేను

(॥॥)
చెక్కునొక్కి జవరాలు చేరి నిన్ను వేఁడుకొని
వుక్కుమీరి గుబ్బలు నిన్నొరయఁ గాను
యిక్కువలఁ దొలుత నిన్నేమని తిట్టెనోకాని
పక్కన నింతటిలోనే పంతమిచ్చెను

(॥॥)
కమ్మటిఁ గాఁగిట నించి కడు నిన్ను లాలించి
సమ్మతి మోవితేనెలు చవిచూపుతా
యిమ్ములఁ దొలుత నిన్ను యేమి సేనెనో కాని
ముమ్మాటికి నీకుఁ బ్రియములు చెప్పెను

(॥॥)
తమకించి నిన్నుఁ గూడి తమ్ములానకు నోరొగ్గి
ప్రమదానఁ దురుము నీపై నొరగఁ గా
అమర శ్రీవేంకటేశ యంతలో నన్నేలితివి
సమమోహాలని యాపె సారె సారె మెచ్చెను

(||pallavi||)
aunayya tagavu nem̐ḍaṭṭidĕ kādā
vĕూnamudoḍuda nīgu mŏkku mŏkkenu

(||||)
sĕkkunŏkki javarālu seri ninnu vem̐ḍugŏni
vukkumīri gubbalu ninnŏrayam̐ gānu
yikkuvalam̐ dŏluda ninnemani tiṭṭĕnogāni
pakkana niṁtaḍilone paṁtamichchĕnu

(||||)
kammaḍim̐ gām̐giḍa niṁchi kaḍu ninnu lāliṁchi
sammadi movidenĕlu savisūbudā
yimmulam̐ dŏluda ninnu yemi senĕno kāni
mummāḍigi nīgum̐ briyamulu sĕppĕnu

(||||)
tamagiṁchi ninnum̐ gūḍi tammulānagu norŏggi
pramadānam̐ durumu nībai nŏragam̐ gā
amara śhrīveṁkaḍeśha yaṁtalo nannelidivi
samamohālani yābĕ sārĕ sārĕ mĕchchĕnu