(॥పల్లవి॥)
ఔనయ్య నీకింతా నలవాటే పో
నానాఁటఁ దెలిసేవు నన్ను నీవే చెలియా
(॥ఔనౌ॥)
యేమయ్య యిందాఁకా నెటువోతివే నే-
నామనిమెకాల వేఁటలాడఁబోతినే
బూమి సర్వసముఁడ వీబుద్ది దగునా అందు-
కేమే రావణాదిదుష్టు లిందరి నేఁ జంపనా
(॥ఔనౌ॥)
ఐతే నీమేనివాస నది యేడదె
ఆతలఁ బుప్పొడి నామై నంటుకొనెనే
యీతల నీమేనిజీర లేల వచ్చెను
వోతరుణి పూఁదీగె లొరసెనే నన్ను
(॥ఔనౌ॥)
కాని మెయి చెమరించఁ గారణమేల నేఁ-
డీనెపము వేసఁగి యెండదాఁకెనే
మోనపుశ్రీవేంకటేశ మోవిగంటేలా నేఁ
బూని శంఖమూ దఁగానే పొరయెతైనే
(||pallavi||)
aunayya nīgiṁtā nalavāḍe po
nānām̐ṭam̐ dĕlisevu nannu nīve sĕliyā
(||aunau||)
yemayya yiṁdām̐kā nĕḍuvodive ne-
nāmanimĕgāla vem̐ṭalāḍam̐bodine
būmi sarvasamum̐ḍa vībuddi dagunā aṁdu-
keme rāvaṇādiduṣhṭu liṁdari nem̐ jaṁpanā
(||aunau||)
aide nīmenivāsa nadi yeḍadĕ
ādalam̐ buppŏḍi nāmai naṁṭugŏnĕne
yīdala nīmenijīra lela vachchĕnu
vodaruṇi pūm̐dīgĕ lŏrasĕne nannu
(||aunau||)
kāni mĕyi sĕmariṁcham̐ gāraṇamela nem̐-
ḍīnĕbamu vesam̐gi yĕṁḍadām̐kĕne
monabuśhrīveṁkaḍeśha movigaṁṭelā nem̐
būni śhaṁkhamū dam̐gāne pŏrayĕdaine