(॥పల్లవి॥)
ఔనయ్య మరి యడుగ నేఁటికి
నా నీ వయసులు నయము లిచ్చే
(॥ఔనయ్య॥)
కొలువులోపలికొమ్మ మాటాడితే
నిలువెల్ల నిదె నీకుఁ జెమరించె
చెలు లవి చూచి సిగ్గులు వడిరి
చలివాపె నేఁడు జంటవలపు
(॥ఔనయ్య॥)
సరసము నీతో సతి ఆడితే
ఆరయఁగ గురులాయఁ జెనకులు
పొరుగువారెల్ల పొరచి చూచిరి
తెరదీసి నిదె తెగ నాసలు
(॥ఔనయ్య॥)
కౌఁగిటిలో నిన్ను కాంత గూడితేను
మాఁగి నీ మోవిని మంచితేనె చిందెను
ఆఁగిరి శ్రీవేంకటాధిప సతులు
యేఁగుఁ బెండ్లి సేసె నీడనే రతులు
(||pallavi||)
aunayya mari yaḍuga nem̐ṭigi
nā nī vayasulu nayamu lichche
(||aunayya||)
kŏluvulobaligŏmma māḍāḍide
niluvĕlla nidĕ nīgum̐ jĕmariṁchĕ
sĕlu lavi sūsi siggulu vaḍiri
salivābĕ nem̐ḍu jaṁṭavalabu
(||aunayya||)
sarasamu nīdo sadi āḍide
ārayam̐ga gurulāyam̐ jĕnagulu
pŏruguvārĕlla pŏrasi sūsiri
tĕradīsi nidĕ tĕga nāsalu
(||aunayya||)
kaum̐giḍilo ninnu kāṁta gūḍidenu
mām̐gi nī movini maṁchidenĕ siṁdĕnu
ām̐giri śhrīveṁkaḍādhiba sadulu
yem̐gum̐ bĕṁḍli sesĕ nīḍane radulu