Aunayya mamchivaamdavauduvu neevu

ఔనయ్య మంచివాఁడవౌదువు నీవు
Language

(॥పల్లవి॥)
ఔనయ్య మంచివాఁడవౌదువు నీవు
సేనలుగా నుద్దండాలు సేయనేర్చుకొంటివి

(॥ఔన॥)
మొనసి చుట్టమవంటా మొక్కవచ్చినసతిని
వొసర నీతోడపై గూచుండుమనేవు
మనిసిచ్చి నీవాడేమాటలు వినేదాని
పెనఁగుచుఁ జన్నులే పిసికేవు నీవు

(॥ఔన॥)
చూపుల వేడుక నిన్నుఁ జూడవచ్చినదాని
కాఁపరాలు సేయుమంటాఁ గాఁతాళించేవు
యేపుమీర నిన్నుసుద్దు లిట్టే యడిగేటిదాని
చేపట్టి మోవెల్లా గంటిసేసేవు నీవు

(॥ఔన॥)
చేరి నీచెనకులకు సిగ్గులువడేటిదాని
కూరిమితోఁ గాఁగిలించుకొనుమనేవు
యీరీతి శ్రీవేంకటేశ యేలితి పొరుగు దాని
కేరుచుఁ నవ్వఁగా గిలిగించేవు నీవు

(||pallavi||)
aunayya maṁchivām̐ḍavauduvu nīvu
senalugā nuddaṁḍālu seyanersugŏṁṭivi

(||auna||)
mŏnasi suṭṭamavaṁṭā mŏkkavachchinasadini
vŏsara nīdoḍabai gūsuṁḍumanevu
manisichchi nīvāḍemāḍalu vinedāni
pĕnam̐gusum̐ jannule pisigevu nīvu

(||auna||)
sūbula veḍuga ninnum̐ jūḍavachchinadāni
kām̐parālu seyumaṁṭām̐ gām̐tāḽiṁchevu
yebumīra ninnusuddu liṭṭe yaḍigeḍidāni
sebaṭṭi movĕllā gaṁṭisesevu nīvu

(||auna||)
seri nīsĕnagulagu sigguluvaḍeḍidāni
kūrimidom̐ gām̐giliṁchugŏnumanevu
yīrīdi śhrīveṁkaḍeśha yelidi pŏrugu dāni
kerusum̐ navvam̐gā giligiṁchevu nīvu