Aunayya mamchivaamdavannidaa neevu

ఔనయ్య మంచివాఁడవన్నిటా నీవు
Language

(॥పల్లవి॥)
ఔనయ్య మంచివాఁడవన్నిటా నీవు
వేనలి ముట్టి చెలిని వేడుక చేసేవు

(॥ఔన॥)
అందలమెక్కిన నిన్ను ఆకె గొలిచి రాఁగాను
పొందుగాఁ జన్నులొత్తేవు బొట్టనవేల
అందుకుఁగా వేరొక్కతె అట్టె నిన్ను సాదించితే
విందువలె నాపె చెక్కు వేలనొత్తేవు

(॥ఔన॥)
కుంచె వేసే యట్టి యాపె కుచ్చలమీఁద మోచేత
అంచలనూఁదుకొనేవు ఆయాలు సోఁక
పొంచి వేరొక్కతె నిన్ను బొమ్మల జంకించితే
చంచుల మోవి చూపి సన్నచేసేవు

(॥ఔన॥)
కాళాంజివట్టే సతికైదండ వట్టుకొని
గోలవై శ్రీ వేంకటేశ గోరనూదేవు
మేలుతో నలమేలుమంగ మెచ్చికౌఁగలించుకొంటే
యీలీల నురముమీఁద నెక్కించుకొనేవు

(||pallavi||)
aunayya maṁchivām̐ḍavanniḍā nīvu
venali muṭṭi sĕlini veḍuga sesevu

(||auna||)
aṁdalamĕkkina ninnu āgĕ gŏlisi rām̐gānu
pŏṁdugām̐ jannulŏttevu bŏṭṭanavela
aṁdugum̐gā verŏkkadĕ aṭṭĕ ninnu sādiṁchide
viṁduvalĕ nābĕ sĕkku velanŏttevu

(||auna||)
kuṁchĕ vese yaṭṭi yābĕ kuchchalamīm̐da moseda
aṁchalanūm̐dugŏnevu āyālu som̐ka
pŏṁchi verŏkkadĕ ninnu bŏmmala jaṁkiṁchide
saṁchula movi sūbi sannasesevu

(||auna||)
kāḽāṁjivaṭṭe sadigaidaṁḍa vaṭṭugŏni
golavai śhrī veṁkaḍeśha goranūdevu
meludo nalamelumaṁga mĕchchigaum̐galiṁchugŏṁṭe
yīlīla nuramumīm̐da nĕkkiṁchugŏnevu