ఔనయ్య మంచివాఁడ వప్పుడే యెంతసేసితి
(॥పల్లవి॥)
ఔనయ్య మంచివాఁడ వప్పుడే యెంతసేసితి
పూనెఁ బ్రేమ పేరెవర పోబుళేళ నీకు
(॥ఔన॥)
కన్నుల నవ్వులుదేరీ కాంత నేమేమి సేసితో
పన్నినయేకతవేళఁ బానుపుమీఁద
కిన్నెరకాయచన్నులు గిజిగిజాయ నిదివో
కన్నె ఇంతె తొలుసారే కడుఁబచ్చి సేతురా
(॥ఔన॥)
మోవకమోచి సెలవి ముసిముసినవ్వుదేరీ
ఆవేళ నేమేమిమాటలాడితో నీవు
కానిమోవి తెల్లఁబారి కడుసదమదమాయ
పూవువంటిబాల ఇంతభోగముల కోవునా
(॥ఔన॥)
చెక్కులఁ జెమటగారి చెలిపయ్యద దడిసె
గక్కన నెంత మనసు గరఁచితివో
యెక్కువ శ్రీవేంకటేశ యీడఁ బెరియవరాన
వోక్కటఁ గూడితి విట్టే వొబుళేశుఁడవై
(||pallavi||)
aunayya maṁchivām̐ḍa vappuḍe yĕṁtasesidi
pūnĕm̐ brema perĕvara pobuḽeḽa nīgu
(||auna||)
kannula navvuluderī kāṁta nememi sesido
panninayegadaveḽam̐ bānubumīm̐da
kinnĕragāyasannulu gijigijāya nidivo
kannĕ iṁtĕ tŏlusāre kaḍum̐bachchi sedurā
(||auna||)
movagamosi sĕlavi musimusinavvuderī
āveḽa nememimāḍalāḍido nīvu
kānimovi tĕllam̐bāri kaḍusadamadamāya
pūvuvaṁṭibāla iṁtabhogamula kovunā
(||auna||)
sĕkkulam̐ jĕmaḍagāri sĕlibayyada daḍisĕ
gakkana nĕṁta manasu garam̐sidivo
yĕkkuva śhrīveṁkaḍeśha yīḍam̐ bĕriyavarāna
vokkaḍam̐ gūḍidi viṭṭe vŏbuḽeśhum̐ḍavai