Aunayya mamchivaamda vamganado nemanevu

ఔనయ్య మంచివాఁడ వంగనతో నేమనేవు
Language

(॥పల్లవి॥)
ఔనయ్య మంచివాఁడ వంగనతో నేమనేవు
కానుకలిచ్చితేనే గక్కన నేలితిని

(॥ఔన॥)
యెలమి దేవులుండఁగా నెడమాటలాడేటి -
చెలికత్తియలనేల చెనకేవు
కలిగినమేలెల్ల కాఁగిటిలో నుండఁగాను
చెలఁగి దోంతులకేల చేతులు చాఁచితివి

(॥ఔన॥)
బెరసినాపె వుండఁగా పేరటమువచ్చిన -
పోరుగువారినేల పోదిగేవు
యిరవైన చుట్టరిక మింటిలో నుండఁగాను
గరుసు దాఁటి వావులు కలయఁబెట్టితివి

(॥ఔన॥)
జాడతోడ సేసలు చల్లుతా నాపె వుండఁగా
తోడఁ బెండ్లికూఁతులతో మాఁటాడేవు
వీడ కలమేల్మంగ శ్రీవేంకటేశ నీకుండఁగా
వూడిగపువారి నెంత వోవలఁ బెట్టితివి

(||pallavi||)
aunayya maṁchivām̐ḍa vaṁganado nemanevu
kānugalichchidene gakkana nelidini

(||auna||)
yĕlami devuluṁḍam̐gā nĕḍamāḍalāḍeḍi -
sĕligattiyalanela sĕnagevu
kaliginamelĕlla kām̐giḍilo nuṁḍam̐gānu
sĕlam̐gi doṁtulagela sedulu sām̐sidivi

(||auna||)
bĕrasinābĕ vuṁḍam̐gā peraḍamuvachchina -
poruguvārinela podigevu
yiravaina suṭṭariga miṁṭilo nuṁḍam̐gānu
garusu dām̐ṭi vāvulu kalayam̐bĕṭṭidivi

(||auna||)
jāḍadoḍa sesalu salludā nābĕ vuṁḍam̐gā
toḍam̐ bĕṁḍligūm̐tulado mām̐ṭāḍevu
vīḍa kalamelmaṁga śhrīveṁkaḍeśha nīguṁḍam̐gā
vūḍigabuvāri nĕṁta vovalam̐ bĕṭṭidivi