Aunayya mamchivaamda vamdagu vachchinadaani

ఔనయ్య మంచివాఁడ వండకు వచ్చినదాని
Language

(॥పల్లవి॥)
ఔనయ్య మంచివాఁడ వండకు వచ్చినదాని
పూని యలయించే వింత కోపునటవయ్యా

(॥॥)
తనువెల్ల జెమరించె దప్పి దేరె మోవి మీఁద
ననుపున నింతి నెంత నవ్వించేవయ్యా
పెనగొనె హారములు బేఁట్లు రాలె గందము
చెనకి యప్పటి నేల సిగ్గు రేఁచేవయ్యా

(॥॥)
వెలయఁ దురుము జారె వేడుకల దగ దొట్టె
చలాల నెంత సేసలు చల్లించేవయ్యా
పులకలు గడు నిండె పోఁక ముడి వీడెను
అలరి యెంత వసంతా లాడించేవయ్యా

(॥॥)
కాటుక కప్పు దేరె గక్కనఁ బయ్యె దెడలె
సూటి నెంత చిత్తరువు చూపించేవయ్యా
గాటాన శ్రీ వేంకటేశ కౌఁగిలించుకొంటి విట్టే
మాటి మాటికి నెంత మరిగించేవయ్యా

(||pallavi||)
aunayya maṁchivām̐ḍa vaṁḍagu vachchinadāni
pūni yalayiṁche viṁta kobunaḍavayyā

(||||)
tanuvĕlla jĕmariṁchĕ dappi derĕ movi mīm̐da
nanubuna niṁti nĕṁta navviṁchevayyā
pĕnagŏnĕ hāramulu bem̐ṭlu rālĕ gaṁdamu
sĕnagi yappaḍi nela siggu rem̐sevayyā

(||||)
vĕlayam̐ durumu jārĕ veḍugala daga dŏṭṭĕ
salāla nĕṁta sesalu salliṁchevayyā
pulagalu gaḍu niṁḍĕ pom̐ka muḍi vīḍĕnu
alari yĕṁta vasaṁtā lāḍiṁchevayyā

(||||)
kāḍuga kappu derĕ gakkanam̐ bayyĕ dĕḍalĕ
sūḍi nĕṁta sittaruvu sūbiṁchevayyā
gāḍāna śhrī veṁkaḍeśha kaum̐giliṁchugŏṁṭi viṭṭe
māḍi māḍigi nĕṁta marigiṁchevayyā