ఔనయ్య ఆఁటదాని అంతర మెరఁగవు
(॥పల్లవి॥)
ఔనయ్య ఆఁటదాని అంతర మెరఁగవు
మానాపతి యౌత నీ మనసే యెరఁగదా
(॥ఔన॥)
సిగ్గుపడి వున్నపతి చిత్తమెరఁగక నీవు
అగ్గలంపు గర్వియంటా నాడుకొనేవు
యెగ్గెరఁగనిముద్దరా లెదిటికి రాకుండితే
కగ్గి యలిగినదంటాఁ గాఁతాలించేవు
(॥ఔన॥)
గుట్టుతోడ నున్న దానిగుణము విచారించక
నెట్టినఁ జలపాదంటా నేరమెంచేవు
వొట్టి కొలువులోపల నోజతోఁ దలవంచితే
యెట్టిమాయలాఁడి యంటా నెంచుకొనేవు
(॥ఔన॥)
నడుమ సారెకు నీతో నవ్వలోఁగి వుండితేను
కడు రాజసము దంటాఁ గమ్మి తిట్టేవు
అడరి శ్రీవెంకటేశ అలమేలుమంగ ఆకె
కడఁకతో నిన్నుఁ గూడఁగాఁ దమకించేవు
(||pallavi||)
aunayya ām̐ṭadāni aṁtara mĕram̐gavu
mānābadi yauda nī manase yĕram̐gadā
(||auna||)
siggubaḍi vunnabadi sittamĕram̐gaga nīvu
aggalaṁpu garviyaṁṭā nāḍugŏnevu
yĕggĕram̐ganimuddarā lĕdiḍigi rāguṁḍide
kaggi yaliginadaṁṭām̐ gām̐tāliṁchevu
(||auna||)
guṭṭudoḍa nunna dāniguṇamu visāriṁchaga
nĕṭṭinam̐ jalabādaṁṭā neramĕṁchevu
vŏṭṭi kŏluvulobala nojadom̐ dalavaṁchide
yĕṭṭimāyalām̐ḍi yaṁṭā nĕṁchugŏnevu
(||auna||)
naḍuma sārĕgu nīdo navvalom̐gi vuṁḍidenu
kaḍu rājasamu daṁṭām̐ gammi tiṭṭevu
aḍari śhrīvĕṁkaḍeśha alamelumaṁga āgĕ
kaḍam̐kado ninnum̐ gūḍam̐gām̐ damagiṁchevu