Auna mamchivaamda vaabe tolle muddaraalu

ఔన మంచివాఁడ వాపె తొల్లె ముద్దరాలు
Language

(॥పల్లవి॥)
ఔన మంచివాఁడ వాపె తొల్లె ముద్దరాలు
ఆనలేల పెట్టేవు అంతేసి కోపునా

(॥ఔన॥)
చెలి నీతో నవ్వెనంటా చెక్కులేల నొక్కేవు
కలన నీగోళ్లు మిక్కిలివాండ్లు
పలుకుమంటా సారె పయ్యదేల తీసేవు
బలిమికాఁడవు నీతో పంతాల కోవునా

(॥ఔన॥)
జంకించి చూచెనంటా చన్నులేల పట్టేవు
కంకణపునీచేతులు కడుగట్లు
అంకెలఁ బెనఁగుమంటా ఆయములేల ముట్టేవు
సంకెలేనివాఁడవు నీసాములకు నోపునా

(॥ఔన॥)
తోక్కేవు పాదాలంటా తురుమేల యంటేవు
నెక్కొని నీవేళ్లు కిన్నెరమీట్లు
అక్కున శ్రీవేంకటేశ అలమేలుమంగ గూడేవు
వెక్కపుజాణవు నీవినొదాల కోపునా

(||pallavi||)
auna maṁchivām̐ḍa vābĕ tŏllĕ muddarālu
ānalela pĕṭṭevu aṁtesi kobunā

(||auna||)
sĕli nīdo navvĕnaṁṭā sĕkkulela nŏkkevu
kalana nīgoḽlu mikkilivāṁḍlu
palugumaṁṭā sārĕ payyadela tīsevu
balimigām̐ḍavu nīdo paṁtāla kovunā

(||auna||)
jaṁkiṁchi sūsĕnaṁṭā sannulela paṭṭevu
kaṁkaṇabunīsedulu kaḍugaṭlu
aṁkĕlam̐ bĕnam̐gumaṁṭā āyamulela muṭṭevu
saṁkĕlenivām̐ḍavu nīsāmulagu nobunā

(||auna||)
tokkevu pādālaṁṭā turumela yaṁṭevu
nĕkkŏni nīveḽlu kinnĕramīṭlu
akkuna śhrīveṁkaḍeśha alamelumaṁga gūḍevu
vĕkkabujāṇavu nīvinŏdāla kobunā