ఔఁగా దనవచ్చునా అయినట్టయ్యీఁ గాక
(॥పల్లవి॥)
ఔఁగా దనవచ్చునా అయినట్టయ్యీఁ గాక
కౌఁగిటికి వచ్చే పతి కరుణ యెందున్నదో
(॥॥)
చెలులకు బుద్ది లేదు చిలుకలఁ దిట్ట రాదు
యెలమి నారమణుఁడు నింటికి రాఁడు
వలరాజు గుఱిగాఁడు వంకవోదు పూవుటమ్ము
చెలఁగి విరహ మెంత సేయ నున్నదో
(॥॥)
మనసూఁ జుట్టము గాదు మందానిలూ ననరాదు
చన విచ్చి విభుఁడూ నాసలు చూపఁడు
జునుగ నీఁడు చంద్రుఁడు సొంపు మాయదు వెన్నెల
తనివోని మోహ మెంత దడ వేఁచ నున్నదో
(॥॥)
వయసూ నణఁచరాదు వసంతుఁడూఁ దోడుగాఁడు
ప్రియుడిట్టే వచ్చెనాకు భేదమూఁ గాఁడు
దయ తో నన్నేలె నితఁడే శ్రీ వేంకటేశుఁడు
నియతి నా రతులలో నేరు పెట్టున్నదో
(||pallavi||)
aum̐gā danavachchunā ayinaṭṭayyīm̐ gāga
kaum̐giḍigi vachche padi karuṇa yĕṁdunnado
(||||)
sĕlulagu buddi ledu silugalam̐ diṭṭa rādu
yĕlami nāramaṇum̐ḍu niṁṭigi rām̐ḍu
valarāju guṟigām̐ḍu vaṁkavodu pūvuḍammu
sĕlam̐gi viraha mĕṁta seya nunnado
(||||)
manasūm̐ juṭṭamu gādu maṁdānilū nanarādu
sana vichchi vibhum̐ḍū nāsalu sūbam̐ḍu
junuga nīm̐ḍu saṁdrum̐ḍu sŏṁpu māyadu vĕnnĕla
tanivoni moha mĕṁta daḍa vem̐sa nunnado
(||||)
vayasū naṇam̐sarādu vasaṁtum̐ḍūm̐ doḍugām̐ḍu
priyuḍiṭṭe vachchĕnāgu bhedamūm̐ gām̐ḍu
daya to nannelĕ nidam̐ḍe śhrī veṁkaḍeśhum̐ḍu
niyadi nā radulalo neru pĕṭṭunnado