Aulevayya yeṟumgudu mamdarimumdara neevu

ఔలేవయ్య యెఱుఁగుదు మందరిముందర నీవు
Language

(॥పల్లవి॥)
ఔలేవయ్య యెఱుఁగుదు మందరిముందర నీవు
మేలములాడితేనే యెమ్మెలు మెరసేవా

(॥ఔనే॥)
శిరసు వంచుకుండఁగా జిన్న బోయుందాననంటా
ఆరిదిఁ జెక్కువట్టి ఆడుమనేవు
దొరవు నీ వెఱఁగవా తొల్లిసేసినసేఁతలు
తిరిగి యాడించుకొను దేవరకు వేడుకా

(॥ఔనే॥)
ఆవలిమోమై వుండఁగా నలిగి వుందాననంటా
చేవట్టి తీసి నన్నుఁ జెప్పుమనేవు
నీవే యెఱఁగవా నీ నడక లన్నియును
వావాత నే విన్నవించ దేవరకు వేడుకా

(॥ఔనే॥)
పానుపుపై నుండఁగాను పంతాన నుందాన నంటా
సేనగా శ్రీ వేంకటేశ చెప్పుమనేవు
నీ నటనలెఱఁగవా నేఁడు నన్నుఁ గూడితివి
తేనెమోవినాడించుకో దేవరకు వేడుకా

(||pallavi||)
aulevayya yĕṟum̐gudu maṁdarimuṁdara nīvu
melamulāḍidene yĕmmĕlu mĕrasevā

(||aune||)
śhirasu vaṁchuguṁḍam̐gā jinna boyuṁdānanaṁṭā
āridim̐ jĕkkuvaṭṭi āḍumanevu
dŏravu nī vĕṟam̐gavā tŏllisesinasem̐talu
tirigi yāḍiṁchugŏnu devaragu veḍugā

(||aune||)
āvalimomai vuṁḍam̐gā naligi vuṁdānanaṁṭā
sevaṭṭi tīsi nannum̐ jĕppumanevu
nīve yĕṟam̐gavā nī naḍaga lanniyunu
vāvāda ne vinnaviṁcha devaragu veḍugā

(||aune||)
pānububai nuṁḍam̐gānu paṁtāna nuṁdāna naṁṭā
senagā śhrī veṁkaḍeśha sĕppumanevu
nī naḍanalĕṟam̐gavā nem̐ḍu nannum̐ gūḍidivi
tenĕmovināḍiṁchugo devaragu veḍugā