(॥పల్లవి॥)
ఔలేరా జాణతనాలాడేవు నీవు
లేలే నే నీవలె లెక్కలు వెట్టేనా
(॥॥)
కప్పకురా నీగుణాలు కందువ పొద్దాయ, నేఁ-
గప్పినట్టే నీకుచాలు గప్పేవు గాక
ముప్పిరిఁ గరఁగకురా ముదితలఁ జూచి, నీవే
కప్పురము నోరిలోనే కరఁచేవుగాక
(॥॥)
కన్నుల గీఁటకురా కాంతలకు నేనా నీవే
కిన్నెరతంత్రుల గోర గీఁటేవు గాక
యెన్నిక చెమట చింద నేలరా చెక్కులవెంట,
చిన్ని మోవిఁ దేనె నీవే చిందేవే యిపుడు
(॥॥)
జాఱనీకురా సిగ్గు సంగడిరతుల, నీకే
జాఱెఁగదీ మునిగోంగు సంతసాలతో
మీఱి శ్రీ వేంకటేశ్వర మేలుతోఁ గూడితివి
ఆఱడికూటములెల్లా నబ్బెఁగదే నీకు
(||pallavi||)
aulerā jāṇadanālāḍevu nīvu
lele ne nīvalĕ lĕkkalu vĕṭṭenā
(||||)
kappagurā nīguṇālu kaṁduva pŏddāya, nem̐-
gappinaṭṭe nīgusālu gappevu gāga
muppirim̐ garam̐gagurā mudidalam̐ jūsi, nīve
kappuramu norilone karam̐sevugāga
(||||)
kannula gīm̐ṭagurā kāṁtalagu nenā nīve
kinnĕradaṁtrula gora gīm̐ṭevu gāga
yĕnniga sĕmaḍa siṁda nelarā sĕkkulavĕṁṭa,
sinni movim̐ denĕ nīve siṁdeve yibuḍu
(||||)
jāṟanīgurā siggu saṁgaḍiradula, nīge
jāṟĕm̐gadī munigoṁgu saṁtasālado
mīṟi śhrī veṁkaḍeśhvara meludom̐ gūḍidivi
āṟaḍigūḍamulĕllā nabbĕm̐gade nīgu