Aule yeṟimgidimi anniyu nemdu

ఔలే యెఱిఁగితిమి అన్నియు నేఁడు
Language

(॥పల్లవి॥)
ఔలే యెఱిఁగితిమి అన్నియు నేఁడు
మేలుమేలు జాణవౌదు మెచ్చితిమి నిన్నును

(॥ఔలే॥)
నీమేనివాసనలే నెలఁతమేన నున్నవి
యేమి సమ్మంధములో మీ కిద్దరికిని
చేముట్టి నా కప్పటి నీచెలిజవ్వాది వూసేవు
కామించి కదంబముగాఁ గలుపేవు వలపు

(॥ఔలే॥)
అదిగో నీవుంగరాలే ఆపెవేళ్లఁ గొన్నున్నవి
కదిసినతగ వెంతగద్దో కాని
వుదుటున నీముద్దుటుంగరము నా కిచ్చేవు
పొదిగి తొరలించేవా పొరుగులవలపు

(॥ఔలే॥)
అంగపునీకరఁగులే అలమేల్ మంగ కున్నవి
సంగతి శ్రీవేంకటేశ చనవెట్టిదో
అంగవించి యేలితివి అప్పటి నన్నింతలోనే
ముంగిటనే నిలిపేవా మునుకొన్నవలపు

(||pallavi||)
aule yĕṟim̐gidimi anniyu nem̐ḍu
melumelu jāṇavaudu mĕchchidimi ninnunu

(||aule||)
nīmenivāsanale nĕlam̐tamena nunnavi
yemi sammaṁdhamulo mī kiddarigini
semuṭṭi nā kappaḍi nīsĕlijavvādi vūsevu
kāmiṁchi kadaṁbamugām̐ galubevu valabu

(||aule||)
adigo nīvuṁgarāle ābĕveḽlam̐ gŏnnunnavi
kadisinadaga vĕṁtagaddo kāni
vuduḍuna nīmudduḍuṁgaramu nā kichchevu
pŏdigi tŏraliṁchevā pŏrugulavalabu

(||aule||)
aṁgabunīgaram̐gule alamel maṁga kunnavi
saṁgadi śhrīveṁkaḍeśha sanavĕṭṭido
aṁgaviṁchi yelidivi appaḍi nanniṁtalone
muṁgiḍane nilibevā munugŏnnavalabu