(॥పల్లవి॥)
ఔలే యెంతటివాఁడవయ్యా నీవు
యేలుకొమ్మని మొక్కితే నెమ్మెలాయ నీకు
(॥ఔలే॥)
చనవు మెరసి నిను సతి గోరుదాఁకించితే
కనలి కుచ్చితమంటాఁ గాఁతాళించేవు
యెనసి యెవ్వరిచే నేమేమి సేయించుకొనవు
వనితచేఁతకే వాసివచ్చె నీకు
(॥ఔలే॥)
పొందెరుఁగుదువంటాను పువ్వుల నిన్ను వేసితే
నిందుకే మచ్చరమంటా నీసడించేవు
అందరిచే సోఁకినప్పు డౌఁగాదని యనవు
యిందుముఖి చెనకులే యెరవాయ నీకు
(॥ఔలే॥)
చుట్టిరికానఁ జన్నులు సోఁకఁ గాఁగిలించితేను
గట్టువాయతనమంటాఁ గడుఁ దిప్పేవు
ఇట్టె శ్రీ వేంకటేశ యెందరి నీవు గూడవు
అట్టె యీపెరతులు అలవాయ నీకు
(||pallavi||)
aule yĕṁtaḍivām̐ḍavayyā nīvu
yelugŏmmani mŏkkide nĕmmĕlāya nīgu
(||aule||)
sanavu mĕrasi ninu sadi gorudām̐kiṁchide
kanali kuchchidamaṁṭām̐ gām̐tāḽiṁchevu
yĕnasi yĕvvarise nememi seyiṁchugŏnavu
vanidasem̐tage vāsivachchĕ nīgu
(||aule||)
pŏṁdĕrum̐guduvaṁṭānu puvvula ninnu veside
niṁduge machcharamaṁṭā nīsaḍiṁchevu
aṁdarise som̐kinappu ḍaum̐gādani yanavu
yiṁdumukhi sĕnagule yĕravāya nīgu
(||aule||)
suṭṭirigānam̐ jannulu som̐kam̐ gām̐giliṁchidenu
gaṭṭuvāyadanamaṁṭām̐ gaḍum̐ dippevu
iṭṭĕ śhrī veṁkaḍeśha yĕṁdari nīvu gūḍavu
aṭṭĕ yībĕradulu alavāya nīgu