Aule nijamu nishtooramamduru logamuvaaru

ఔలే నిజము నిష్టూరమందురు లోకమువారు
Language

(॥పల్లవి॥)
ఔలే నిజము నిష్టూరమందురు లోకమువారు
నీ లాగులు దడవితే నేఁడు సిగ్గయ్యీనా

(॥ఔలే॥)
పచ్చల వోవరిలోన బంగారు పీఁటల మీఁద
పచ్చిదేర నవ్వదా పడఁతి నీతో
తచ్చి నన్నెంత చూచేవు తలఁచుకో ఇంకా నీవే
అచ్చటి సుద్ది చెప్పితే నాయములు సోఁకెనా

(॥ఔలే॥)
పరగఁ దెరమాటున పక్కనే పవళించి
సురటి విసరదా సుదతి నీకు
అరుదందనేల నో నన్నియును తెలుసుకో
ఇరవుగాఁ జెప్పితేనే యెగసక్కె మాయనా

(॥ఔలే॥)
వుడవోని నీకాఁగిట వొద్దికైన రతులను
బడివాయక కూడదా భామం తోను
అడరి శ్రీవేంకటేశ అట్టె నన్ను నేలితివి
వడి నిన్ను మెచ్చితేనే వలపులు రేఁగెనా

(||pallavi||)
aule nijamu niṣhṭūramaṁduru logamuvāru
nī lāgulu daḍavide nem̐ḍu siggayyīnā

(||aule||)
pachchala vovarilona baṁgāru pīm̐ṭala mīm̐da
pachchidera navvadā paḍam̐ti nīdo
tachchi nannĕṁta sūsevu talam̐sugo iṁkā nīve
achchaḍi suddi sĕppide nāyamulu som̐kĕnā

(||aule||)
paragam̐ dĕramāḍuna pakkane pavaḽiṁchi
suraḍi visaradā sudadi nīgu
arudaṁdanela no nanniyunu tĕlusugo
iravugām̐ jĕppidene yĕgasakkĕ māyanā

(||aule||)
vuḍavoni nīgām̐giḍa vŏddigaina radulanu
baḍivāyaga kūḍadā bhāmaṁ tonu
aḍari śhrīveṁkaḍeśha aṭṭĕ nannu nelidivi
vaḍi ninnu mĕchchidene valabulu rem̐gĕnā