Aule nene meegu nalasaidini

ఔలే నేనే మీకు నలసైతిని
Language

(॥పల్లవి॥)
ఔలే నేనే మీకు నలసైతిని
తేలించేవు యింతు కిదే చాలుఁగాదా

(॥ఔలే॥)
ఆరీతి నన్ను నిట్టె యాడవచ్చుఁ గాక మరు-
బారిఁ జిక్కి నావలెఁ బడవచ్చునా
నేరుపు మెరసి మీకు నెలఁత లిందరు నన్ను
దూరినట్టె యాతనిని దూరరాదా పోయి

(॥ఔలే॥)
అప్పటప్పటికి నన్ను నలుగకుమని బుద్ది
చెప్పవచ్చుఁగాక నాకుఁ జేయవచ్చునా
యెప్పటి మావొడఁబాట్లెఱఁగక నన్నునే మీ-
రుప్పటించే రాతనినే వుప్పటించరాదా

(॥ఔలే॥)
అంచెల నిందరును మీ రాతినిని నన్ను దగ్గ-
రించవచ్చుఁగాక తమి రేఁచవచ్చునా
యెంచఁగల శ్రీవేంకటేశుఁ డిదె నన్నుఁ గూడె
మించి యేకచిత్తాన మెచ్చరాదా యిఁకను

(||pallavi||)
aule nene mīgu nalasaidini
teliṁchevu yiṁtu kide sālum̐gādā

(||aule||)
ārīdi nannu niṭṭĕ yāḍavachchum̐ gāga maru-
bārim̐ jikki nāvalĕm̐ baḍavachchunā
nerubu mĕrasi mīgu nĕlam̐ta liṁdaru nannu
dūrinaṭṭĕ yādanini dūrarādā poyi

(||aule||)
appaḍappaḍigi nannu nalugagumani buddi
sĕppavachchum̐gāga nāgum̐ jeyavachchunā
yĕppaḍi māvŏḍam̐bāṭlĕṟam̐gaga nannune mī-
ruppaḍiṁche rādanine vuppaḍiṁcharādā

(||aule||)
aṁchĕla niṁdarunu mī rādinini nannu dagga-
riṁchavachchum̐gāga tami rem̐savachchunā
yĕṁcham̐gala śhrīveṁkaḍeśhum̐ ḍidĕ nannum̐ gūḍĕ
miṁchi yegasittāna mĕchcharādā yim̐kanu