Auduve tagavari vannidaanu

ఔదువే తగవరి వన్నిటాను
Language

(॥పల్లవి॥)
ఔదువే తగవరి వన్నిటాను
బోదించరాదా పురుషునిని

(॥ఔదు॥)
మలసి నీవిభుఁడు మాటలాడఁగా
పలుకఁగరాదా పడఁతులకు
బలిమిఁ జెఱఁగతఁడు పట్టి తియ్యఁగా
నిలువఁగరాదా నెలవులను

(॥ఔదు॥)
పాయకతఁడిపుడు పందెము వేయఁగ
చేయొగ్గరాదా చెలులకును
చాయలనప్పటి సరసములాడఁగ
సేయఁగరాదా సేవలు నేను

(॥ఔదు॥)
శ్రీ వేంకటేశుఁడు చేకొని కూడఁగ
మోవియ్యరాదా ముదితలకు
యీవలననుఁ దానిటు మన్నించఁగ
భావించరాదా పలుమరు రతులు

(||pallavi||)
auduve tagavari vanniḍānu
bodiṁcharādā puruṣhunini

(||audu||)
malasi nīvibhum̐ḍu māḍalāḍam̐gā
palugam̐garādā paḍam̐tulagu
balimim̐ jĕṟam̐gadam̐ḍu paṭṭi tiyyam̐gā
niluvam̐garādā nĕlavulanu

(||audu||)
pāyagadam̐ḍibuḍu paṁdĕmu veyam̐ga
seyŏggarādā sĕlulagunu
sāyalanappaḍi sarasamulāḍam̐ga
seyam̐garādā sevalu nenu

(||audu||)
śhrī veṁkaḍeśhum̐ḍu segŏni kūḍam̐ga
moviyyarādā mudidalagu
yīvalananum̐ dāniḍu manniṁcham̐ga
bhāviṁcharādā palumaru radulu