ఔదువే జాణవు నీవు అన్నిటాను
(॥పల్లవి॥)
ఔదువే జాణవు నీవు అన్నిటాను
సాదవా నీవును తొల్లె జాణఁడవురా
(॥ఔదు॥)
ఆకసపుఁగొలనిపై నంటుఁదామరలు వుట్టె
యీకత చెప్పఁగదవే యింతిరో నీవు
మేకొని మరువింకి మిట్టెకోలలై యవి
కూకులు వత్తులుగానీగురి దాఁకురా
(॥ఔదు॥)
అలరినశశిబింబమందు తేనెపెర వుట్టె
కల విరుచఁగదే నిక్కముగా నీవు
చలమున నిదియె చంద్రకళలోనితేటై
నెలకొన నీనోరు నిండుకొనురా
(॥ఔదు॥)
ఆమనెరఁటులపై రావాకుబదనికె వుట్టె
నేమందుకు వచ్చును నా కెరిఁగించవే
గోమున శ్రీవేంకటేశ కూడిన యీరతివేళ
వేమరు నాతో నీవు విద్యలాడవచ్చురా
(||pallavi||)
auduve jāṇavu nīvu anniḍānu
sādavā nīvunu tŏllĕ jāṇam̐ḍavurā
(||audu||)
āgasabum̐gŏlanibai naṁṭum̐dāmaralu vuṭṭĕ
yīgada sĕppam̐gadave yiṁtiro nīvu
megŏni maruviṁki miṭṭĕgolalai yavi
kūgulu vattulugānīguri dām̐kurā
(||audu||)
alarinaśhaśhibiṁbamaṁdu tenĕbĕra vuṭṭĕ
kala virusam̐gade nikkamugā nīvu
salamuna nidiyĕ saṁdragaḽalonideḍai
nĕlagŏna nīnoru niṁḍugŏnurā
(||audu||)
āmanĕram̐ṭulabai rāvāgubadanigĕ vuṭṭĕ
nemaṁdugu vachchunu nā kĕrim̐giṁchave
gomuna śhrīveṁkaḍeśha kūḍina yīradiveḽa
vemaru nādo nīvu vidyalāḍavachchurā