Auduve doddadaana vadani dakkamgomtivi

ఔదువే దొడ్డదాన వతని దక్కఁగొంటివి
Language

(॥పల్లవి॥)
ఔదువే దొడ్డదాన వతని దక్కఁగొంటివి
యీ దెస నీ నేరుపులే యెన్నికాయఁ జెలియా

(॥ఔదు॥)
యెలమిఁ గొలువుసతు లెందరు లేరు పతికి
తలఁపునఁ బాయినిదే తరుణిగాక
వల పెంతలేదు మరి వంతులకు వలవఁగా
కలయిక కింపైనదే వలయుఁగాక

(॥ఔదు॥)
పూనిమాట లెన్నిలేవు పొలఁతు లాడితేఁ బతి-
వీనులఁబట్టినవే వేడుకగాక
నానఁబెట్టె దేమరుదు నవ్వుల సెలవులను
నానాఁటిసరసముల నాఁటవలెఁగాక

(॥ఔదు॥)
చెలిమి యెంతలేదు శ్రీవేంకటపతికి
అలమేల్మంగ నీపొందే యమరుఁగాక
మెలుపున నన్నుఁ గూడె మేలింకా నెంతలేదు
అలరి నీవలె మెఱయఁగవలెఁగాక

(||pallavi||)
auduve dŏḍḍadāna vadani dakkam̐gŏṁṭivi
yī dĕsa nī nerubule yĕnnigāyam̐ jĕliyā

(||audu||)
yĕlamim̐ gŏluvusadu lĕṁdaru leru padigi
talam̐punam̐ bāyinide taruṇigāga
vala pĕṁtaledu mari vaṁtulagu valavam̐gā
kalayiga kiṁpainade valayum̐gāga

(||audu||)
pūnimāḍa lĕnnilevu pŏlam̐tu lāḍidem̐ badi-
vīnulam̐baṭṭinave veḍugagāga
nānam̐bĕṭṭĕ demarudu navvula sĕlavulanu
nānām̐ṭisarasamula nām̐ṭavalĕm̐gāga

(||audu||)
sĕlimi yĕṁtaledu śhrīveṁkaḍabadigi
alamelmaṁga nībŏṁde yamarum̐gāga
mĕlubuna nannum̐ gūḍĕ meliṁkā nĕṁtaledu
alari nīvalĕ mĕṟayam̐gavalĕm̐gāga