Auduvayyaa jaanavu annidaa neevu

ఔదువయ్యా జాణవు అన్నిటా నీవు
Language

(॥పల్లవి॥)
ఔదువయ్యా జాణవు అన్నిటా నీవు
పోదితోఁ దమి రేఁగిన పొలుపా ఇది

(॥ఔదు॥)
పచ్చిమాటలాడేవు పైకొని కొలువులోన
పెచ్చుసతులఁ బొందినపెరిమా యిది
లచ్చనలు వెట్టేవు లావుగా సతులమీఁద
తచ్చి రట్టిడివయిన తగవా యిది

(॥ఔదు॥)
యేడనుండో వచ్చి నేఁడు యిందరితోడ నవ్వేవు
వేడుకకాఁడవైన విధమాయిది
వోడక చాఁచేవు చేతులూరకే శిరములపై
వీడెపు చొక్కలతోడి వింతా యిది

(॥ఔదు॥)
పొలసి నిలువుననే పోఁకముడి జారించేవు
వలపులు సందడించే వరుసా యిది
యిలలో శ్రీవేంకటేశ యేలితివి మమ్మునిట్టే
మెలుపుకాఁతాళవు మేకా యిది

(||pallavi||)
auduvayyā jāṇavu anniḍā nīvu
podidom̐ dami rem̐gina pŏlubā idi

(||audu||)
pachchimāḍalāḍevu paigŏni kŏluvulona
pĕchchusadulam̐ bŏṁdinabĕrimā yidi
lachchanalu vĕṭṭevu lāvugā sadulamīm̐da
tachchi raṭṭiḍivayina tagavā yidi

(||audu||)
yeḍanuṁḍo vachchi nem̐ḍu yiṁdaridoḍa navvevu
veḍugagām̐ḍavaina vidhamāyidi
voḍaga sām̐sevu sedulūrage śhiramulabai
vīḍĕbu sŏkkaladoḍi viṁtā yidi

(||audu||)
pŏlasi niluvunane pom̐kamuḍi jāriṁchevu
valabulu saṁdaḍiṁche varusā yidi
yilalo śhrīveṁkaḍeśha yelidivi mammuniṭṭe
mĕlubugām̐tāḽavu megā yidi