ఔదువయ్యా జాణఁడవు అన్నిటాను
(॥పల్లవి॥)
ఔదువయ్యా జాణఁడవు అన్నిటాను
సాదవని పొగడితే జడిసేవయ్యా
(॥ఔదు॥)
నీచిత్తము రావలసి నేఁ జేసితి నూడిగాలు
యేచి యందుకు నవ్వే వదేమయ్యా
చేచేత నే విన్నపాలు చెవిలోనఁ జేసితేను
లాచి నన్నుఁ దిట్టితివి లాగౌనయ్యా
(॥ఔదు॥)
సంగతి నాకుమడిచి చవిదెలిసిచ్చి తేను
యెంగిలంటాఁ గానుసేసేవేమయ్యా
ముంగిట నే నీశిరసుముడిచేనంటా నంటితే
వంగి నాకొప్పు నంటేవు వాసికాఁడవయ్యా
(॥ఔదు॥)
గాఁటముగా రతికేలిఁ గాఁగిలించుకొంటేను
నాఁటెఁ జన్నులంటా గోరగీఁటేవయ్యా
నీఁటుల శ్రీవేంకటేశ నిన్ను నేనే మెచ్చితేను
యీటులేనిచనవెల్లా నిచ్చితివయ్యా
(||pallavi||)
auduvayyā jāṇam̐ḍavu anniḍānu
sādavani pŏgaḍide jaḍisevayyā
(||audu||)
nīsittamu rāvalasi nem̐ jesidi nūḍigālu
yesi yaṁdugu navve vademayyā
seseda ne vinnabālu sĕvilonam̐ jesidenu
lāsi nannum̐ diṭṭidivi lāgaunayyā
(||audu||)
saṁgadi nāgumaḍisi savidĕlisichchi tenu
yĕṁgilaṁṭām̐ gānusesevemayyā
muṁgiḍa ne nīśhirasumuḍisenaṁṭā naṁṭide
vaṁgi nāgŏppu naṁṭevu vāsigām̐ḍavayyā
(||audu||)
gām̐ṭamugā radigelim̐ gām̐giliṁchugŏṁṭenu
nām̐ṭĕm̐ jannulaṁṭā goragīm̐ṭevayyā
nīm̐ṭula śhrīveṁkaḍeśha ninnu nene mĕchchidenu
yīḍulenisanavĕllā nichchidivayyā