ఔదువయ్య జాణవు ప్రహ్లాదవరద
(॥పల్లవి॥)
ఔదువయ్య జాణవు ప్రహ్లాదవరద
ఆదిగొని మొక్కీని ప్రహ్లాదవరదా
(॥॥)
యెదురుఁగొండలెక్కిన యిందిరఁ బెండ్లాడితివి
అది జాణతనము ప్రహ్లదవరద
వుదుటుఁ గోపముమాని వూరకే నవ్వు నవ్వితి-
వదన నాపెఁ జూచి ప్రహ్లదవరదా
(॥॥)
మొగము చూచితేనే మోహముపైఁ జల్లితివి
అగడాయ బనులు ప్రహ్లదవరద
తగిలి కొంగువట్టితే తమకించేవింతలో
అగవుదగవుల ప్రహ్లదవరదా
(॥॥)
చేయి చాఁచగా నాపెను సిగ్గువీడఁ గూడితివి
ఆయమెఱుఁగుదువు ప్రహ్లదవరదా
యీయెడ నహోబలాన నిట్టే శ్రీవేంకటాద్రిని
ఆయిత్తము పెండ్లిండ్లు ప్రహ్లదవరదా
(||pallavi||)
auduvayya jāṇavu prahlādavarada
ādigŏni mŏkkīni prahlādavaradā
(||||)
yĕdurum̐gŏṁḍalĕkkina yiṁdiram̐ bĕṁḍlāḍidivi
adi jāṇadanamu prahladavarada
vuduḍum̐ gobamumāni vūrage navvu navvidi-
vadana nābĕm̐ jūsi prahladavaradā
(||||)
mŏgamu sūsidene mohamubaim̐ jallidivi
agaḍāya banulu prahladavarada
tagili kŏṁguvaṭṭide tamagiṁcheviṁtalo
agavudagavula prahladavaradā
(||||)
seyi sām̐sagā nābĕnu sigguvīḍam̐ gūḍidivi
āyamĕṟum̐guduvu prahladavaradā
yīyĕḍa nahobalāna niṭṭe śhrīveṁkaḍādrini
āyittamu pĕṁḍliṁḍlu prahladavaradā