Au nau mari aamduvaara mamta kobamu

ఔ నౌ మరి ఆఁడువార మంత కోపము
Language

(॥పల్లవి॥)
ఔ నౌ మరి ఆఁడువార మంత కోపము
ఆనతిమ్మా నీకు నితవైనట్టే సేసేను

(॥ఔనౌ॥)
సారె సారె నీతోను సణఁగులు చూపఁగాను
భారము గాదుగదా పంతగాఁడవు
కూరిమి గలిగి నేను గొణుఁగుచుఁ దిట్టఁగాను
వైరముగాదుగదా వాసికాఁడవు

(॥ఔనౌ॥)
కప్పినట్టి నీమోవిగంట్లిట్టె రేఁచఁగాను
నొప్పులు గావుగదా నుడికారివి
చిప్పిల నింటికి నీవు చేయివట్టి తియ్యగాను
దప్పులు గొనవుగదా తమకపుదొరవు

(॥ఔనౌ॥)
కాలుమీఁద గాలువేసి కరఁగించి కూడఁగాను
నాలితో మొక్కవుగదా నాఁటకీఁడవు
యీలీల శ్రీవేంకటేశ ఇట్టె నన్నుఁ గూడితివి
వేళలు గావవుగదా వేడుకకాఁడవు

(||pallavi||)
au nau mari ām̐ḍuvāra maṁta kobamu
ānadimmā nīgu nidavainaṭṭe sesenu

(||aunau||)
sārĕ sārĕ nīdonu saṇam̐gulu sūbam̐gānu
bhāramu gādugadā paṁtagām̐ḍavu
kūrimi galigi nenu gŏṇum̐gusum̐ diṭṭam̐gānu
vairamugādugadā vāsigām̐ḍavu

(||aunau||)
kappinaṭṭi nīmovigaṁṭliṭṭĕ rem̐sam̐gānu
nŏppulu gāvugadā nuḍigārivi
sippila niṁṭigi nīvu seyivaṭṭi tiyyagānu
dappulu gŏnavugadā tamagabudŏravu

(||aunau||)
kālumīm̐da gāluvesi karam̐giṁchi kūḍam̐gānu
nālido mŏkkavugadā nām̐ṭagīm̐ḍavu
yīlīla śhrīveṁkaḍeśha iṭṭĕ nannum̐ gūḍidivi
veḽalu gāvavugadā veḍugagām̐ḍavu