Attivaamdam ganagane hari needaasumda naidi

అట్టివాఁడఁ గనకనే హరి నీదాసుఁడ నైతి
Language

(॥పల్లవి॥)
అట్టివాఁడఁ గనకనే హరి నీదాసుఁడ నైతి
వొట్టిన యపరాధము లొడ్డించుకో వశమా

(॥అట్టివాఁ॥)
యెన్ని నేరాలైనఁ జేసి యేమిటాఁ ధీరని తప్పు
వున్నతి నీ లెంక నైతే వూరకె పోవు
పన్ని పగసేసి వచ్చి బలవంతుని మరుఁగు
తన్ను దానే చొచ్చితేను దక్కిపోవుఁ బనులూ

(॥అట్టివాఁ॥)
వొడ్డిన సొమ్మెల్లాఁ దిని వూనిన ఋణమునకు
బిడ్డపేరు వెట్టితేను బీతి వాసును
అడ్డమై జగడగాని ఆడరానిమాట లాడి
ముడ్డిమీది కెత్తుకొని మొక్కితేనే పోవును

(॥అట్టివాఁ॥)
పాపమే కూడుగ నుండి పట్టి నారా యంటేను
చేపట్టి వైకుంఠ మిచ్చి చేరి కాచితి
యేపున శ్రీ వేంకటేశ యిదీ వినే పో నేను
మూఁపున నీ యచ్చు మోచి ముందర నిలిచితి

(||pallavi||)
aṭṭivām̐ḍam̐ ganagane hari nīdāsum̐ḍa naidi
vŏṭṭina yabarādhamu lŏḍḍiṁchugo vaśhamā

(||aṭṭivām̐||)
yĕnni nerālainam̐ jesi yemiḍām̐ dhīrani tappu
vunnadi nī lĕṁka naide vūragĕ povu
panni pagasesi vachchi balavaṁtuni marum̐gu
tannu dāne sŏchchidenu dakkibovum̐ banulū

(||aṭṭivām̐||)
vŏḍḍina sŏmmĕllām̐ dini vūnina ṛṇamunagu
biḍḍaberu vĕṭṭidenu bīdi vāsunu
aḍḍamai jagaḍagāni āḍarānimāḍa lāḍi
muḍḍimīdi kĕttugŏni mŏkkidene povunu

(||aṭṭivām̐||)
pābame kūḍuga nuṁḍi paṭṭi nārā yaṁṭenu
sebaṭṭi vaiguṁṭha michchi seri kāsidi
yebuna śhrī veṁkaḍeśha yidī vine po nenu
mūm̐puna nī yachchu mosi muṁdara nilisidi