అట్టి నెరవాదివి నీ వలమేలుమంగవు
(॥పల్లవి॥)
అట్టి నెరవాదివి నీ వలమేలుమంగవు
నెట్టన నీ రమణుఁడు నిన్ను మెచ్చీ నిందకు???
(॥అట్టి॥)
ఇయ్యకొంచే మాఁటలెల్లా నింపులై యుండు
నెయ్యముగలిగినట్టి నెలఁతలకు
వొయ్యనే విచారించితే నుపమ వుట్టు
యెయ్యడా నలుకలేని యింతులకును
(॥అట్టి॥)
వున్నది నేమిసేసినా నొడఁబాటౌను
సన్నయెఱిఁగినయట్టి సతులకును
విన్నకన్న సేఁతలెల్లా వేడుకై తోఁచు
అన్నిటా నొరుపుగల యతివలకు
(॥అట్టి॥)
కందువఁ దెలిసితేఁ గరఁగు మతి
అంది వివేకముగల యాఁడువారికి
యిందరిలో శ్రీవేంకటేశుఁడు గూడె
పొందు లిట్టిని నీవఁటి పొలంతులకును
(||pallavi||)
aṭṭi nĕravādivi nī valamelumaṁgavu
nĕṭṭana nī ramaṇum̐ḍu ninnu mĕchchī niṁdagu???
(||aṭṭi||)
iyyagŏṁche mām̐ṭalĕllā niṁpulai yuṁḍu
nĕyyamugaliginaṭṭi nĕlam̐talagu
vŏyyane visāriṁchide nubama vuṭṭu
yĕyyaḍā nalugaleni yiṁtulagunu
(||aṭṭi||)
vunnadi nemisesinā nŏḍam̐bāḍaunu
sannayĕṟim̐ginayaṭṭi sadulagunu
vinnaganna sem̐talĕllā veḍugai tom̐su
anniḍā nŏrubugala yadivalagu
(||aṭṭi||)
kaṁduvam̐ dĕlisidem̐ garam̐gu madi
aṁdi vivegamugala yām̐ḍuvārigi
yiṁdarilo śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
pŏṁdu liṭṭini nīvam̐ṭi pŏlaṁtulagunu