అట్టేకానీ అందుకేమి అవునోయి
(॥పల్లవి॥)
అట్టేకానీ అందుకేమి అవునోయి
తొట్టివున్నది మదము దొరవౌదువోయి
(॥అట్టే॥)
నిన్నుఁ బిలువవచ్చిన నెచ్చెలి చెక్కుపై గోరు
వున్నతి నేల తీసితివోయీ నీవు
అన్నిటా నీపాలిటి ఆపె నేనైతినా
కన్నులార నీ సుద్దులు కానవచ్చెనోయి
(॥అట్టే॥)
చేదివ్వె తెచ్చిన నాచెలి చన్నులమీఁద -
నా దెస నేమో వాసితి వౌనావోయి
దాదాత నాపెకాంక్ష దానిపైఁ జూపితివా
వేదుగా నీసేఁత వెల్లవిరియాయ నోయి
(॥అట్టే॥)
చాకానుకిచ్చిన నాచెలియ మోవిమీఁద
కుగాఁ జేసితిపట కద్దా వోయి
యీకడ శ్రీవేంకటేశ యిద్దరి మమ్మేలితివి
దీకొని నీ యాసోదాలు తెలిసితిమోయి
(||pallavi||)
aṭṭegānī aṁdugemi avunoyi
tŏṭṭivunnadi madamu dŏravauduvoyi
(||aṭṭe||)
ninnum̐ biluvavachchina nĕchchĕli sĕkkubai goru
vunnadi nela tīsidivoyī nīvu
anniḍā nībāliḍi ābĕ nenaidinā
kannulāra nī suddulu kānavachchĕnoyi
(||aṭṭe||)
sedivvĕ tĕchchina nāsĕli sannulamīm̐da -
nā dĕsa nemo vāsidi vaunāvoyi
dādāda nābĕgāṁkṣha dānibaim̐ jūbidivā
vedugā nīsem̐ta vĕllaviriyāya noyi
(||aṭṭe||)
sāgānugichchina nāsĕliya movimīm̐da
kugām̐ jesidibaḍa kaddā voyi
yīgaḍa śhrīveṁkaḍeśha yiddari mammelidivi
dīgŏni nī yāsodālu tĕlisidimoyi