అట్టెకాదా మరి అవునయ్యా నీ
(॥పల్లవి॥)
అట్టెకాదా మరి అవునయ్యా నీ-
పుట్టుగెల్ల నిట్టె పోపోవయ్యా
(॥అట్టె॥)
వుద్దండాన నీవే వొగిఁ గాలుదొక్కి
గద్దించేవు నీవే కానీవయ్యా
అద్దలించఁగానే ఆయము లంటే
పొద్దువోదో నీకు పోపోవయ్యా
(॥అట్టె॥)
దాకొని నీకొంగు దాఁకించి నీవే
మేకొని తిట్టేవు మేలయ్యా
వూఁకొనకుండిన వొత్తిమాఁటాడేవు
బూకలింతేశేల పోపోవయ్యా
(॥అట్టె॥)
కందువల నీవే కాఁగిలించిపట్టి
యిందులోనే జంకించే వేమయ్యా
చిందేటినవ్వుల శ్రీవేంకటేశుఁడ
పొందితివి నన్నుఁ బోపోవయ్యా
(||pallavi||)
aṭṭĕgādā mari avunayyā nī-
puṭṭugĕlla niṭṭĕ pobovayyā
(||aṭṭĕ||)
vuddaṁḍāna nīve vŏgim̐ gāludŏkki
gaddiṁchevu nīve kānīvayyā
addaliṁcham̐gāne āyamu laṁṭe
pŏdduvodo nīgu pobovayyā
(||aṭṭĕ||)
dāgŏni nīgŏṁgu dām̐kiṁchi nīve
megŏni tiṭṭevu melayyā
vūm̐kŏnaguṁḍina vŏttimām̐ṭāḍevu
būgaliṁteśhela pobovayyā
(||aṭṭĕ||)
kaṁduvala nīve kām̐giliṁchibaṭṭi
yiṁdulone jaṁkiṁche vemayyā
siṁdeḍinavvula śhrīveṁkaḍeśhum̐ḍa
pŏṁdidivi nannum̐ bobovayyā