Atte teravesugore yaadamdu neevu

అట్టె తెరవేసుకోరే యాతఁడు నీవు
Language

(॥పల్లవి॥)
అట్టె తెరవేసుకోరే యాతఁడు నీవు
యెట్టయెదుట సతులు యెవ్వరున్నానేమి

(॥॥)
నిగ్గులచన్నులు గాఁగ నిన్ను నాతఁడు నొగడె
సిగ్గులెంత నెరుపేవే చెలియా
వొగ్గి జవ్వనివిగాఁ గా నుప్పతించి నీతో నవ్వె
యెగ్గులెంచ నేమిటికి ఇచ్చకము నేయవే

(॥॥)
తురుము గొప్పదిగాఁ గా దోసిటి సేసలువె ట్టె
విరుల నేల వేసేవే వెలఁదీ
సరులు పెనగొనఁగ చక్కదిద్దె నాతఁడు
సరిఁ బయ్యద ముయ్యక చక్కనుండఁ గదవే

(॥॥)
మేలిమి నీమోవిగాఁ గా మెచ్చి మెచ్చి చేరవచ్చె
మేలము లాడవే యలమేలుమంగ
యీలీల శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
పోలును మీకిద్దరికి భోగించఁగదవే

(||pallavi||)
aṭṭĕ tĕravesugore yādam̐ḍu nīvu
yĕṭṭayĕduḍa sadulu yĕvvarunnānemi

(||||)
niggulasannulu gām̐ga ninnu nādam̐ḍu nŏgaḍĕ
siggulĕṁta nĕrubeve sĕliyā
vŏggi javvanivigām̐ gā nuppadiṁchi nīdo navvĕ
yĕggulĕṁcha nemiḍigi ichchagamu neyave

(||||)
turumu gŏppadigām̐ gā dosiḍi sesaluvĕ ṭṭĕ
virula nela veseve vĕlam̐dī
sarulu pĕnagŏnam̐ga sakkadiddĕ nādam̐ḍu
sarim̐ bayyada muyyaga sakkanuṁḍam̐ gadave

(||||)
melimi nīmovigām̐ gā mĕchchi mĕchchi seravachchĕ
melamu lāḍave yalamelumaṁga
yīlīla śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
polunu mīgiddarigi bhogiṁcham̐gadave