Atte taanemta vaamdainaanaayam gaaga

అట్టే తానెంత వాఁడైనానాయఁ గాక
Language

(॥పల్లవి॥)
అట్టే తానెంత వాఁడైనానాయఁ గాక
వొట్టుకొన్న మగతన మూర కేలుండీనే

(॥॥)
కన్నుల నింతిఁజూచితే కలుగుఁ జుట్టరికము
వన్నెల మాట లాడితే వావి గూడును
సన్నలు సేసితేనే సమ్మందము గలసు
పన్ని కాంతలతో నేల పంత మాడీనే

(॥॥)
చిఱునవ్వు నవ్వితేనే సిగ్గులు దానే తేరు
మఱుఁగునఁ బొలసి నా మర్మాలంటును
గుఱుతులు వినుకొన్నాఁ గూటములు పెనగొను
యెఱుఁ గుదుఁ దననేమ మెంతని చెప్పీనే

(॥॥)
కదిసి యెదుట నుంటే కౌఁగిటికిఁ జేతులంటు
మదిఁ దల పోసితేనే మరుగుఁదమీ
యిదివో శ్రీ వేంకటేశుఁడిట్టే తా నన్ను నేలె
చెదరని ప్రియ మెంత చెల్లఁబెట్టీ ని

(||pallavi||)
aṭṭe tānĕṁta vām̐ḍainānāyam̐ gāga
vŏṭṭugŏnna magadana mūra keluṁḍīne

(||||)
kannula niṁtim̐jūside kalugum̐ juṭṭarigamu
vannĕla māḍa lāḍide vāvi gūḍunu
sannalu sesidene sammaṁdamu galasu
panni kāṁtalado nela paṁta māḍīne

(||||)
siṟunavvu navvidene siggulu dāne teru
maṟum̐gunam̐ bŏlasi nā marmālaṁṭunu
guṟudulu vinugŏnnām̐ gūḍamulu pĕnagŏnu
yĕṟum̐ gudum̐ dananema mĕṁtani sĕppīne

(||||)
kadisi yĕduḍa nuṁṭe kaum̐giḍigim̐ jedulaṁṭu
madim̐ dala posidene marugum̐damī
yidivo śhrī veṁkaḍeśhum̐ḍiṭṭe tā nannu nelĕ
sĕdarani priya mĕṁta sĕllam̐bĕṭṭī ni