అట్టే పెంచితేఁ బెరుగు నడఁచితే నడఁగును
(॥పల్లవి॥)
అట్టే పెంచితేఁ బెరుగు నడఁచితే నడఁగును
దిట్టలై వివేకులాల తెలుసుకోరో
(॥అట్టే॥)
తగలకుండఁగవలె తలఁచితేఁ గామాదులు
పొలుచు నిప్పుల నేయి పోసినట్లూ
కలఁగకుండఁగవలె కలఁగితేను మనసు
చెలఁగి చీమలపుట్ట చిమ్మి రేఁగిన ట్టుండు
(॥అట్టే॥)
యెడ మియ్యకుండవలె యెడమిచ్చితేఁ గోపము
విడివడ్డకోఁతికి వెఱ్ఱెత్తినట్లు
వొడిగట్టకుండవలె వొడిగట్టితే నాసలు
కడళ్లతో సముద్రము కడతేరనట్టు
(॥అట్టే॥)
తగలకుండఁగవలె తగిలితే భోగములు
జిగురుగండెఁ బక్షులు చిక్కినట్లు
తగు శ్రీవేంకటేశ్వరు దాసు లిందు భ్రమయరు
జిగి మించే నమృతము చేతి కబ్బినట్లు
(||pallavi||)
aṭṭe pĕṁchidem̐ bĕrugu naḍam̐side naḍam̐gunu
diṭṭalai vivegulāla tĕlusugoro
(||aṭṭe||)
tagalaguṁḍam̐gavalĕ talam̐sidem̐ gāmādulu
pŏlusu nippula neyi posinaṭlū
kalam̐gaguṁḍam̐gavalĕ kalam̐gidenu manasu
sĕlam̐gi sīmalabuṭṭa simmi rem̐gina ṭṭuṁḍu
(||aṭṭe||)
yĕḍa miyyaguṁḍavalĕ yĕḍamichchidem̐ gobamu
viḍivaḍḍagom̐tigi vĕṭrĕttinaṭlu
vŏḍigaṭṭaguṁḍavalĕ vŏḍigaṭṭide nāsalu
kaḍaḽlado samudramu kaḍaderanaṭṭu
(||aṭṭe||)
tagalaguṁḍam̐gavalĕ tagilide bhogamulu
jigurugaṁḍĕm̐ bakṣhulu sikkinaṭlu
tagu śhrīveṁkaḍeśhvaru dāsu liṁdu bhramayaru
jigi miṁche namṛtamu sedi kabbinaṭlu