Atte ninnum joosi soosi arudamderu selulu

అట్టె నిన్నుఁ జూచి చూచి అరుదందేరు చెలులు
Language

(॥పల్లవి॥)
అట్టె నిన్నుఁ జూచి చూచి అరుదందేరు చెలులు
నెట్టన నీ యెమ్మెలెల్లా నెరపేవు నీవు

(॥అట్టె॥)
మొక్కలపుఁ జేఁతలును మొసగస మాఁటలును
యెక్కడ నేరిచితివే యింతేసి నీవు
చెక్కునఁ బెట్టిన చేయి సెలవుల నవ్వులను
గక్కన నప్పటి నెందు గడియించుకొంటివే

(॥అట్టె॥)
నిడువాలుఁ జూపులును నిక్కుబొమ్మ జంకెనలు
గుడిగొన నెందు దెచ్చుకొంటివే నీవు
వెడజారఁబయ్యెదయు వీడియు వీడని కొప్పు
అడియాలా లన్నియును నమరెనే నీకు

(॥అట్టె॥)
వుప్పతిలు రాజసాలు వులివచ్చి సిగ్గులను
యిప్పుడెందుఁ జదివితి వింతేసి నీవు
అప్పుడు శ్రీవేంకటేశుఁ డలమేల్మంగను నేను
నెప్పున నన్నేల మరి నీ వెన్నటిదానవే

(||pallavi||)
aṭṭĕ ninnum̐ jūsi sūsi arudaṁderu sĕlulu
nĕṭṭana nī yĕmmĕlĕllā nĕrabevu nīvu

(||aṭṭĕ||)
mŏkkalabum̐ jem̐talunu mŏsagasa mām̐ṭalunu
yĕkkaḍa nerisidive yiṁtesi nīvu
sĕkkunam̐ bĕṭṭina seyi sĕlavula navvulanu
gakkana nappaḍi nĕṁdu gaḍiyiṁchugŏṁṭive

(||aṭṭĕ||)
niḍuvālum̐ jūbulunu nikkubŏmma jaṁkĕnalu
guḍigŏna nĕṁdu dĕchchugŏṁṭive nīvu
vĕḍajāram̐bayyĕdayu vīḍiyu vīḍani kŏppu
aḍiyālā lanniyunu namarĕne nīgu

(||aṭṭĕ||)
vuppadilu rājasālu vulivachchi siggulanu
yippuḍĕṁdum̐ jadividi viṁtesi nīvu
appuḍu śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
nĕppuna nannela mari nī vĕnnaḍidānave