Atte neegu nidavaidenaayam gaaga

అట్టే నీకు నితవైతేనాయఁ గాక
Language

(॥పల్లవి॥)
అట్టే నీకు నితవైతేనాయఁ గాక
గుట్టుతోడి సతులకుఁ గోపము రాదా

(॥అట్టే॥)
సన్నలు చేసి నీ కాపె సలిగెలఁ బొరలఁగా
యెన్ని చూచి తక్కినవా రెట్టోరుతురు
మన్ననదాననంటా మాటలు నీతో నాడఁగ
విన్నవారిచెవులకు వెగటు గాదా

(॥అట్టే॥)
యేతులకు నాపె నీతో యీడుజోడై నవ్వఁగాను
యీతలాతలిసతులు యిచ్చగింతురా
పోతరించి తానే నీపొత్తుల నారగించఁగా
కాంతరించి చెలులు గక్కన నిన్ను దూరరా

(॥అట్టే॥)
కందువనుండి నిన్నా పె కాఁగిలించుకొనఁగాను
సందడిసవతు లెల్లా సమ్మతింతురా
విందువలె నన్నును శ్రీ వేంకటేశ కూడితివి
ముందు పెండ్లాడినవారు మోములు చూచుకోరా

(||pallavi||)
aṭṭe nīgu nidavaidenāyam̐ gāga
guṭṭudoḍi sadulagum̐ gobamu rādā

(||aṭṭe||)
sannalu sesi nī kābĕ saligĕlam̐ bŏralam̐gā
yĕnni sūsi takkinavā rĕṭṭoruduru
mannanadānanaṁṭā māḍalu nīdo nāḍam̐ga
vinnavārisĕvulagu vĕgaḍu gādā

(||aṭṭe||)
yedulagu nābĕ nīdo yīḍujoḍai navvam̐gānu
yīdalādalisadulu yichchagiṁturā
podariṁchi tāne nībŏttula nāragiṁcham̐gā
kāṁtariṁchi sĕlulu gakkana ninnu dūrarā

(||aṭṭe||)
kaṁduvanuṁḍi ninnā pĕ kām̐giliṁchugŏnam̐gānu
saṁdaḍisavadu lĕllā sammadiṁturā
viṁduvalĕ nannunu śhrī veṁkaḍeśha kūḍidivi
muṁdu pĕṁḍlāḍinavāru momulu sūsugorā