Atte nee sukrtamu aabannuni rakshimchide

అట్టె నీ సుకృతము ఆపన్నుని రక్షించితే
Language

(॥పల్లవి॥)
అట్టె నీ సుకృతము ఆపన్నుని రక్షించితే
చుట్టమవు నీవే కృపఁ జూడఁగదవయ్యా

(॥అట్టె॥)
వఱత మునిఁగేవాని దరి నుండేవాఁడు
వెఱవక చే యిచ్చి వెళ్లఁదీసును
మఱచి యజ్ఞానములో మగ్గుచు నుండేటి నన్ను
యెఱిఁగిన సర్వేశ్వర యెత్తి కావవయ్యా

(॥అట్టె॥)
చులుకఁగాని వానికి సుఖియైన వైద్యుఁడు
బలువైన మం దిచ్చి బ్రదికించును
కొలయైన పాపములఁ గుంగుచు నుండేటి నన్ను
యిలధరనామామృత మిచ్చి కావవయ్యా

(॥అట్టె॥)
నిరుఁబేద యైనవాని నిండిన ధనవంతుఁడు
ఆరసి లేములు మాన్పి యాదరించును
సరి ననాథుఁడనై శరణు చొచ్చితి నిన్ను
హరి శ్రీవేంకటేశ మే లందిచ్చి కావవయ్యా

(||pallavi||)
aṭṭĕ nī sukṛtamu ābannuni rakṣhiṁchide
suṭṭamavu nīve kṛpam̐ jūḍam̐gadavayyā

(||aṭṭĕ||)
vaṟada munim̐gevāni dari nuṁḍevām̐ḍu
vĕṟavaga se yichchi vĕḽlam̐dīsunu
maṟasi yajñānamulo maggusu nuṁḍeḍi nannu
yĕṟim̐gina sarveśhvara yĕtti kāvavayyā

(||aṭṭĕ||)
sulugam̐gāni vānigi sukhiyaina vaidyum̐ḍu
baluvaina maṁ dichchi bradigiṁchunu
kŏlayaina pābamulam̐ guṁgusu nuṁḍeḍi nannu
yiladharanāmāmṛta michchi kāvavayyā

(||aṭṭĕ||)
nirum̐beda yainavāni niṁḍina dhanavaṁtum̐ḍu
ārasi lemulu mānpi yādariṁchunu
sari nanāthum̐ḍanai śharaṇu sŏchchidi ninnu
hari śhrīveṁkaḍeśha me laṁdichchi kāvavayyā