అట్టె నీ కాఁగిటి కాపె యాసపడి వచ్చెనేవెూ
(॥పల్లవి॥)
అట్టె నీ కాఁగిటి కాపె యాసపడి వచ్చెనేవెూ
దట్టముగ నిఁక దయదలఁచఁగ రాదా
(॥॥)
మోవితేనే లుట్టిపడ ముచ్చటలాడీఁ జెలి
వోవరిలోఁ గూచుండి వూఁ కొనరాదా
చేవమీరఁ గొనగోళ్ళఁ జిక్కుదీసీని నెరులు
సేవలకు మెచ్చి యిట్టె చిత్తగించరాదా
(॥॥)
కొనచూపులనే నీపైఁ గుమ్మరించీ వలపులు
పెనఁగక కాఁగిటికిఁ బిలువగాదా
తనివోనితమకానఁ దడఁ బడి నీకు మొక్కీ
చనవు చేకొని సరసములాడరాదా
(॥॥)
సెలవుల నవ్వులనే సేసలు నీపైఁ బెట్టీ
లలిఁ గంకణము గట్టి లాలించరాదా
యెలమి శ్రీ వేంకటేశ యేలితి వీకె నింతలో
వెలసె నీకోరికలు విడెమియ్యరాదా
(||pallavi||)
aṭṭĕ nī kām̐giḍi kābĕ yāsabaḍi vachchĕnevĕూ
daṭṭamuga nim̐ka dayadalam̐sam̐ga rādā
(||||)
movidene luṭṭibaḍa muchchaḍalāḍīm̐ jĕli
vovarilom̐ gūsuṁḍi vūm̐ kŏnarādā
sevamīram̐ gŏnagoḽḽam̐ jikkudīsīni nĕrulu
sevalagu mĕchchi yiṭṭĕ sittagiṁcharādā
(||||)
kŏnasūbulane nībaim̐ gummariṁchī valabulu
pĕnam̐gaga kām̐giḍigim̐ biluvagādā
tanivonidamagānam̐ daḍam̐ baḍi nīgu mŏkkī
sanavu segŏni sarasamulāḍarādā
(||||)
sĕlavula navvulane sesalu nībaim̐ bĕṭṭī
lalim̐ gaṁkaṇamu gaṭṭi lāliṁcharādā
yĕlami śhrī veṁkaḍeśha yelidi vīgĕ niṁtalo
vĕlasĕ nīgorigalu viḍĕmiyyarādā