అట్టే మేలుకంటినే అదివో నేను
(॥పల్లవి॥)
అట్టే మేలుకంటినే అదివో నేను
గట్టిగా నే నిటువంటి కల గంటినే
(॥అట్టే॥)
తరుణికుచములపైఁ దగ నా మొగము మోపి
గరిమ నే నిద్దరించఁ గల గంటినే
పెరరేఁచి యాపె నన్నుఁ బేరుకొని పిలిచి
కరఁగించి కూడెనంటాఁ గల గంటినే
(॥అట్టే॥)
చిప్పిలేటిమోవి ఇచ్చి చెలియవదనమునఁ
గప్పురము నే నందుకోఁ గల గంటినే
మప్పరిఁ దప్పకచూచి ముదితపయ్యద నాకు
కప్పెనంటా నిప్పుడిట్టే కల గంటినే
(॥అట్టే॥)
మొక్కుచు నింతికి నేను ముంచినపెక్కురతులఁ
గక్కసించితి నంటాఁ గల గంటినే
యిక్కువతో శ్రీవేంకటేశుఁడఁగనక యాకె
గక్కున నన్నుఁ గూడె నిక్కల గంటినె
(||pallavi||)
aṭṭe melugaṁṭine adivo nenu
gaṭṭigā ne niḍuvaṁṭi kala gaṁṭine
(||aṭṭe||)
taruṇigusamulabaim̐ daga nā mŏgamu mobi
garima ne niddariṁcham̐ gala gaṁṭine
pĕrarem̐si yābĕ nannum̐ berugŏni pilisi
karam̐giṁchi kūḍĕnaṁṭām̐ gala gaṁṭine
(||aṭṭe||)
sippileḍimovi ichchi sĕliyavadanamunam̐
gappuramu ne naṁdugom̐ gala gaṁṭine
mapparim̐ dappagasūsi mudidabayyada nāgu
kappĕnaṁṭā nippuḍiṭṭe kala gaṁṭine
(||aṭṭe||)
mŏkkusu niṁtigi nenu muṁchinabĕkkuradulam̐
gakkasiṁchidi naṁṭām̐ gala gaṁṭine
yikkuvado śhrīveṁkaḍeśhum̐ḍam̐ganaga yāgĕ
gakkuna nannum̐ gūḍĕ nikkala gaṁṭinĕ